సీఎం రాజీనామా.. బీజేపీకి భారీ దెబ్బ

Update: 2021-07-03 03:34 GMT
ఓ ప్రణాళిక లేదు.. అసలు ఎమ్మెల్యేనే కాదు.. ఎవరిని పడితే వారిని తీసుకొని సీఎంను చేసేసి బీజేపీ అధిష్టానం ముందూ వెనుకా ఆలోచించకుండా చేస్తున్న పనులకు నవ్వుల పాలవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో ఎమ్మెల్యే కాని వ్యక్తిని సీఎంను చేసి ఇప్పుడు అనుభవిస్తోంది.  ఒకప్పటి కాంగ్రెస్ అధిష్టానాన్ని తలపిస్తోంది.

ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో ఎమ్మెల్యే కాని ఎంపీగా ఉన్న యోగి ఆధిత్యనాథ్ ను తీసుకొచ్చి అక్కడి యూపీ ఎన్నికల కోసం కొట్లాడిన బీజేపీ నేతలను పక్కనపెట్టారు.ఇప్పుడు ఏకు మేకులా మారాడన్న టాక్ ఉంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యాంగ సంక్షోభం తప్పదని తెలిసినా.. ఒక ఎంపీని ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టింది. ఆరునెలల గడువులోగా ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. గడువులోగా అసెంబ్లీలోకి పంపలేకపోయింది. దీంతో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడింది. తప్పనిసరి పరిస్తితుల్లో ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తాజాగా రాజీనామా చేశారు.  అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ ఈ పరిణామం పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉత్తరాఖండ్ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా త్రివేంద్రసింగ్ రావత్ ను సీఎం పీఠం నుంచి దించేసిన హైకమాండ్.. పౌరీ గర్వాల్ ఎంపీ తీరత్ రావత్ ను సీఎంను చేసింది. అయితే ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నిక కాలేకపోయారు. సెప్టెంబర్ లో ఉత్తరాఖండ్ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో దీనికి ముందు ఉప ఎన్నికలకు ఈసీ నో చెప్పింది. దీంతో సీఎం పోస్టుకు రావత్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

బీజేపీ నిర్లక్ష్యం కారణంగా ఉత్తరాఖండ్ లో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయని .. పాత కాంగ్రెస్ లాగానే బీజేపీ చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా తీరత్ సింగ్ రావత్ ఢిల్లీలోనే మకాం వేసి దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరిపారు.ఈ క్రమంలోనే ఎమ్మెల్యేగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు కష్టం కాబట్టి తీరత్ తో రాజీనామా చేయించి ఈ మూడు నెలల కాలానికి కొత్త నేతను ఉత్తరాఖండ్ సీఎం చేయాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించింది. ఉత్తరాఖండ్ లో ముగ్గురు సీఎంలను మార్చేసి బీజేపీ పరువు పోగొట్టుకున్నట్టు అయ్యింది.

ఉత్తరాఖండ్ లో శాసనమండలి లేదు. ఉంటే ఎమ్మెల్సీని చేసి సీఎంగా తీరత్ కొనసాగేవారు. ఇక తీరత్ కోసం రాజీనామా చేయడానికి ఒక్క ఎమ్మెల్యే కూడా సిద్ధపడలేదు. సెప్టెంబర్ లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఉప ఎన్నికలకు అవకాశం లేకుండా పోయింది.

తీరత్ రాజీనామాతో ఉత్తరాఖండ్ సీఎం పోస్టులో ఇప్పుడు ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ధన్ సింగ్, సత్పాల్ లలో ఒకరిని సీఎంను చేసేందుకు బీజేపీ అధిష్టానం డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. బీజేఎల్పీ సమావేశంలో దీనిపై క్లారిటీ రానుంది.
Tags:    

Similar News