నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను - నాతో పాటు మిమ్మల్ని కూడా పనిచేయిస్తాను.. లాంటి డైలాగులతో చంద్రబాబునాయుడు సాధారణంగా అధికార వర్గాల్లో ఒక గుబులు పుట్టిస్తూ ఉంటారు. అధికార యంత్రాంగం మొత్తాన్ని ఆయన ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ఉంటారని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఇదంతా పెద్ద భ్రమ. వాస్తవంలో ఏం జరుగుతున్నదంటే.. చంద్రబాబునాయుడే అధికారుల చేతిలో కీలుబొమ్మలా మారిపోతున్న పరిస్థితి ఉంది. సీఎంఓ రూపంలో చంద్రబాబు నాయుడు చుట్టూతా రౌండప్ చేసి ఉండే కీలక అధికారులు - ఆ పరిధిలోనే చంద్రబాబు నాయుడు పనితీరు బందీ అయిపోతున్నదా అనే ప్రచారం రాజకీయ - కింది స్థాయి అధికార వర్గాల్లో జరుగుతోంది.
ఈ వ్యవహారం మొత్తం అనంతపురం జిల్లా కరవు పర్యటన సందర్భంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా కరవు ప్రాంతాలను పర్యటించిన చంద్రబాబు.. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నట్లు తన దృష్టికి ఎవరూ తేనే లేదని, ఇప్పుడు బాగా ఆలస్యం అయిపోయిందని ఇప్పుడు చేస్తున్న సహాయక చర్యలు కనీసం 15 రోజుల ముందుగా చేపట్టి ఉంటే రైతులకు మేలు జరిగేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరవు గురించి తన దృష్టికి తీసుకురాలేదని అధికార్లపై ఎగిరి పడ్డారు.
అయితే అధికార్ల ఆవేదన ఏంటంటే.. చంద్రబాబు వరకు ఏ విషయాన్ని కూడా తీసుకువెళ్లే పరిస్థితి లేనేలేదని అంటున్నారు. ఆయన చుట్టూ ఉండే అధికార్ల కోటరీ సీఎంఓ రూపంలో చంద్రబాబు కదలికల్ని శాసిస్తున్నదనేది ఆరోపణ. సీఎంఓను దాటి చంద్రబాబును కలిసి సమస్యలను నివేదించడం తమకే సాధ్యం కావడం లేదంటూ సీనియర్ నాయకులే ఆవేదన వ్యక్తం చేస్తుండడం విశేషం. గతంలో సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అధికార్ల మాట ప్రకారమే నడుచుకుంటూ.. పతనం కొనితెచ్చుకున్నాడనే విమర్శలు కొన్ని ఉన్నాయి. ఈసారి కూడా ఆయన సీఎంఓ అధికారుల కబంధహస్తాల్లోకి వెళ్లిపోతున్నారనే విమర్శలు కిందిస్థాయి అధికారులు - నాయకుల నుంచి వినిపిస్తున్నాయిట. చంద్రబాబునాయుడు కరవు & ప్రాంతానికి వచ్చినప్పుడు, ''నాకు ముందే చెప్పలేదే'' అంటూ లోకల్ అధికార్లపై ఆగ్రహించే బదులు - తన దృష్టికి వారు తీసుకురావడానికి తగినంత పారదర్శకంగా తన చుట్టూ ఉన్న సీఎంవో అధికార కోటరీ వ్యవస్థ ఉన్నదా లేదా చెక్ చేసుకుంటే ఆయనకు - ప్రజలకు కూడా మేలు జరుగుతుందని జనం అంటున్నారు.