ఎన్నికలు వస్తున్నాయంటే మీడియాకు చేతి నిండా పనే. కొన్ని సందర్భాల్లో ఆసక్తికర వార్తల కొరత ఎదుర్కొంటే మీడియా సంస్థలకు.. ఊపిరి సలపనంత పని పెరిగిపోతుంటుంది. తమదైన మార్క్ కోసం కొన్నిమీడియా సంస్థలు చాలా కష్టపడుతుంటాయి. సొంతంగా సర్వేలు నిర్వహిస్తుంటాయి. ఇలాంటి సర్వేలు నిర్వహించే మీడియా సంస్థల రిపోర్ట్ లు కొద్దిపాటి తేడాలతో ఇంచుమించు ఒకేలా ఉండటం కనిపిస్తుంటుంది. కానీ.. ఈసారి అందుకు భిన్నమైన సీన్ ఒకటి బయటకు వచ్చింది.
ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా.. అందరి దృష్టి ఉత్తరప్రదేశ్ (యూపీ)మీదనే. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రంతో పాటు.. ఆ రాష్ట్రంలో గెలుపు జాతీయ రాజకీయాల మీద ఎంతో ప్రభావం చూపుతుందనటంలో సందేహం లేదు. దీంతో.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. యూపీలో జరుగుతున్న ఎన్నికల మీదనే మీడియా సంస్థల ఫోకస్ ఎక్కువగా ఉందని చెప్పాలి. ఎన్నికల వేడి రాజుకున్న వేళ.. రెండు ప్రముఖ మీడియా సంస్థలు యూపీ ఎన్నికలపై తాము నిర్వహించిన సర్వే ఫలితాల్ని ప్రకటించాయి. టైమ్స్ నౌ తో పాటు.. సీఎన్ఎన్ – న్యూస్ 18లు చేపట్టిన సర్వే ఫలితాలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ఉండటం గమనార్హం.
టౌమ్స్ నౌ ఛానల్ సర్వేలో గెలుపు బీజేపీకి పక్కా అని తేలిస్తే.. సీఎన్ఎన్ –న్యూస్ 18 సర్వే మాత్రం ఎస్పీకి అత్యధిక స్థానాలు దక్కే అవకాశం ఉందని.. బీజేపీకి రెండోస్థానం దక్కనుందన్న అంచనాను వేసింది. సీఎన్ ఎన్ మెగా పోల్ సర్వేలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ (ఎస్పీ)- కాంగ్రెస్ కూటమికి అత్యధికంగా 181 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేసింది. ఇక.. బీజేపీ 160 స్థానాల్ని గెలుచుకొని రెండో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 57 స్థానాలు మాత్రమే లభిస్తాయని అంచనా వేసింది.
మరోవైపు టౌమ్స్ నౌ చేపట్టిన సర్వే ఫలితాలు ఇందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. ఈ మీడియా సంస్థ అంచనా ప్రకారం యూపీలోని 403 స్థానాలకు బీజేపీ 202 స్థానాల్లో విజయం సాధిస్తుందని.. ఎస్పీ –కాంగ్రెస్ కూటమికి 147 స్థానాలు మాత్రమే లభిస్తాయని వెల్లడించింది. బీఎస్పీకి 47స్థానాలు.. ఇతరులు 7 స్థానాలకు పరిమితం అవుతారని వెల్లడించింది. ప్రస్తుత యూపీ అసెంబ్లీలోని పార్టీల బలాబలాలతో రానున్న అంచనా ఫలితాల్ని పోల్చి చూస్తే.. బీజేపీ భారీగా లాభపడునున్నట్లుగా ఈ సర్వే చెబుతోంది. ఇప్పుడున్న స్థానాలతో పోలిస్తే 155 స్థానాలు అధికంగా బీజేపీ ఖాతాలోకి పడనున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో ఎస్సీ- కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడున్న సీట్లలో 105 స్థానాలు కోల్పోనున్నట్లు పేర్కొంది. అదే దారిలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ కూడా నడుస్తున్నట్లు పేర్కొంది. ఇప్పుడున్న బలంలో 33 స్థానాల్ని ఆ పార్టీ చేజార్చుకోనుందన్న అంచనాను వెల్లడించింది. మరి.. ఈ ఇద్దరి జోస్యాల్లో ఎవరిది నిజం అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/