కరోనా లాక్ డౌన్ నిబంధనలను పాటించలేదని సీఆర్ పీఎఫ్ కమాండోపై కర్ణాటక పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. మాస్క్ ధరించలేదన్న కారణంతో మావోయిస్టు వ్యతిరేక కోబ్రా యూనిట్ లో కమాండోగా పనిచేస్తున్న సీఆర్ పీఎఫ్ జవాన్ సచిన్ సావంత్ ను బెల్గావీ పోలీసుస్టేషన్ కు తీసుకెళ్లి గొలుసులతో కట్టేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెలవుల నిమిత్తం ఇంటికొచ్చిన సచిన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది.
దీనిపై స్పందించిన సీఆర్ పీఎఫ్ ఉన్నతాధికారులు కర్ణాటక పోలీసులపై ఫైర్ అయ్యారు. తమ జవాన్ పై కర్ణాటక పోలీసులు లాఠీలతో దాడికి పాల్పడ్డారని, బేడీలు వేసి, పోలీసు స్టేషన్ దాకా నడిపించుకుంటూ తీసుకెళ్లారని సీఆర్ పీఎఫ్ ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నారు. బాధిత జవాన్ కు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ కు లేఖ రాశారు. ఈ ఘటనపై కర్ణాటక పోలీసు చీఫ్‌తో మాట్లాడామనీ, సచిన్ కు బెయిల్ కోసం స్థానిక అధికారితో బెయిల్ పిటిషన్ వేయించామని సీఆర్ పీఎఫ్ తెలిపింది. అయితే , తమపై దురుసుగా ప్రవర్తించడంతోనే సచిన్ ను అరెస్టు చేసినట్టు పోలీసులు ఎఫ్ ఐఆర్ లో పొందుపరిచారు.
అసలు ఏమి జరిగిందంటే ? సీఆర్ పీఎఫ్ కు చెందిన కోబ్రా దళంలో సచిన్ సావంత్ జవాన్ గా పనిచేస్తున్నాడు. అతడి స్వస్థలం కర్ణాటకలోని ఎగ్జాంబా గ్రామం. ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. 23న సావంత్ తన ఇంటి ముందు బైక్ ను క్లీన్ చేస్తుండగా పోలీసులు అటుగా వచ్చారు. లాక్ డౌన్ అమల్లో ఉంది, ఇంట్లో ఉండకుండా బయట ఎందుకు ఉన్నావంటూ ప్రశ్నించారు. అంతే కాకుండా మాస్కు ఎందుకు ధరించలేదని నిలదీశారు. సావంత్ కూడా గట్టిగా బదులిచ్చారు. దీంతో పోలీసులు ఆగ్రహంతో అతడిపై దాడికి పాల్పడ్డారు. చేతికి బేడీలు వేశారు. పోలీసు స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనకి సంబంధించిన ఫోటోలు , వీడియో లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.