తమిళ‌నాడులో పెప్సీ, కోలా బంద్‌!

Update: 2017-01-25 13:17 GMT
ఊహించిన‌ట్లుగానే తమిళనాడు వ్యాపారులు విదేశీ బ్రాండ్స్‌ ను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. స్వదేశీ బ్రాండ్స్‌ పై అవగాహన కల్పించి... అమ్మకాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర వ్యాపార‌స్తులు నిర్ణయించారు. విదేశీ బ్రాండ్స్ అయిన పెప్సీ - కోలాతో పాటు ఇతర పానీయాలు - వస్తువులను మార్చి 1 నుంచి నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు. విదేశీ బ్రాండ్స్ నిషేధంపై ఫిబ్రవరి నెలలో అవగాహన కల్పించేందుకు వ్యాపారులు సిద్ధమయ్యారు. పెప్సీ - కోలాతో పాటు ఇతర విదేశీ వస్తువులు శరీరానికి హానిక‌ర‌మ‌ని తెలిపారు.

కూల్ డ్రింక్స్‌ లో రసాయనాలు విరివిగా వాడటం వల్ల ఆరోగ్యానికి ముప్పు వచ్చే అవకాశం ఉందన్నారు. రెస్టారెంట్లు - హోటల్‌ లో వీటిని నిషేధించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే స‌మ‌యంలో వినియోగ‌దారులు స‌హ‌క‌రించేందుకు గాను పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దేశ‌వాళీ పానీయాల‌ను స్వీక‌రించడం వ‌ల్ల క‌లిగే లాభాల గురించి తెలియ‌జెప్తూ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జెప్ప‌డం ద్వారా విదేశీ కూల్ డ్రింక్స్ ల‌ను దూరం చేయ‌డానికి అవ‌కాశం ఉంటుంద‌ని వారు ధీమా వ్య‌క్తం చేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News