అప్పుడు.. ఇప్పుడు ఒకటే మాయ.. భోజనాలు ఒక్కటే కామనట

Update: 2021-07-28 03:58 GMT
తాను అనుకున్నది పూర్తి చేసుకోవటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు. విన్నంతనే కనెక్టు అయ్యేలాంటి ఆయన మాటల సమ్మోహనం తన ఏడేళ్ల పాలనను పూర్తి చేసుకున్నా.. ఇంకా కంటిన్యూ చేయగలగటం ఆయనకే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. చైతన్యానికి మారుపేరుగా చెప్పే తెలంగాణ సమాజం.. కేసీఆర్ చెప్పే మాటలకు ఇట్టే పడిపోతుందన్న విమర్శ వినిపిస్తోంది.

తాను ఏదైనా అంశాన్ని టార్గెట్ గా పెట్టుకుంటే.. సీఎం కేసీఆర్ ఎలా పని చేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఆయనకున్న ఏకైక టార్గెట్ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఘన విజయాన్నిసాధించటం. అందుకోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో దళితులు నిర్ణయాత్మక శక్తిగా ఉండటం.. వారిని గంపగుత్తగా తన వైపునకు తిప్పుకోవటానికి వీలుగా.. దళిత బంధు పథకాన్ని తెచ్చున్నారన్న మాట వినిపిస్తోంది.

అంతేనా.. ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టని వైనం విస్మయానికి గురి చేస్తోంది. మోత్కుపల్లి నరసింహుల్నే తీసుకోండి. ఆయనకు తెలంగాణ రాజకీయాల్లో ఉన్న ఇమేజ్ ఎంత? ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ఎక్కడైనా పోటీ చేస్తే పడే ఓట్లు ఎన్ని? అన్నది పెద్ద ప్రశ్న. అయినప్పటికీ ఆయన్ను ఆధారంగా చేసుకొని బీజేపీని దెబ్బేసేందుకు కేసీఆర్ కదిపిన పావులు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టార్గెట్ పెద్దది అయినప్పుడు.. దాన్ని ముక్కలు ముక్కలు చేసి.. టార్గెట్ ను ఛేదించే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నారు. ఒక మోత్కుపల్లి నరసింహులు.. మరో పెద్దిరెడ్డి లాంటి ఏజ్ ఓల్డ్ సీనియర్ల దన్నుతో ప్రత్యర్థి పార్టీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే..ఈ ఇద్దరు వెటరన్ లీడర్లు గతంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారే కావటం గమనార్హం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అంటే.. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధిక్యత కోసం కేసీఆర్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. లక్షకోట్ల రూపాయిల్ని ఖర్చు చేసి అయినా సరే.. దళిత బంధు పథకాన్నివిజయవంతం చేస్తామని.. ఆ మాటకు వస్తే.. దళిత బంధు అన్నది పథకం కాదని.. అది ఒక ఉద్యమం అంటూ ప్రజలు ఇట్టే నమ్మేలా ఆయన మాటలు ఉంటున్నాయి. తాజాగా ఎంపిక చేసిన వారిని ప్రగతి భవన్ కు పిలిపించి.. దాదాపు ఎనిమిది గంటల పాటు వారికి బ్రెయిన్ వాష్ చేసి..మంచిగా భోజనాలు పెట్టిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

సీఎం కేసీఆర్ ఎప్పుడు.. ఎవరిని టార్గెట్ చేసినా.. వారిని ప్రగతిభవన్ కు పిలిపించటం.. వారితో సమావేశం అయ్యాక.. భోజనాలు పెట్టించి..వాటికి భారీ ప్రచారం చేసుకోవటం టీఆర్ఎస్ అధినేతకు ఒక అలవాటు. తాజాగా దళిత బంధు ఎపిసోడ్ లోనూ ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని కొందరు తప్పు పడుతున్నారు. గతంలో ఆర్టీసీ కష్టాల్ని తీరుస్తానని.. వేలాది కోట్లు ఖర్చు చేసైనా సరే.. ఆర్టీసీని బతికించుకుంటామని చెబుతూ.. ఆర్టీసీకి చెందిన మహిళా ఉద్యోగులు పలువురిని ప్రగతిభవన్ కు పిలిపించుకొని భేటీ కావటం.. వారితో కలిసి భోజనం చేయటం తెలిసిందే.

అద్భుతమైన ప్లానింగ్ లో భాగంగా ఇంటికి పిలిపించుకొని వారితో మాట్లాడటం.. భోజనాలు పంపటం మాత్రమే కాదు.. ఆ తర్వాత వాటిని వదిలేయటం కూడా సీఎం కేసీఆర్ కు కామన్ అంటూ విమర్శలు చేస్తున్నారు. తాజా దళిత బంధు పథకం అమలు కోసం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన హుజూర్ నగర్ నియోజకవర్గానికి చెందిన దాదాపు 500 మందిని ఎంపిక చేసి ప్రగతిభవన్ కు పిలిపించుకొని మాట్లాడి.. భోజనం పెట్టిన సందర్భంగా తీసిన ఫోటోను పెట్టి మరీ విమర్శలు చేస్తున్నారు. మరి.. వాటిని ఎంత మేర సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటారో చూడాలి.
Tags:    

Similar News