తిరుమలలో ఇక సామాన్యులూ వీఐపీ భక్తులు కావొచ్చు!

Update: 2019-10-22 13:02 GMT
తిరుమల శ్రీవారి సేవలకై పది వేల రూపాయల విరాళం ఇస్తే చాలు..మీరు  కూడా వీఐపీలు అయిపోవచ్చు. బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకోవచ్చు. ఈ మేరకు అవకాశాన్ని కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్పులు జరగబోతున్నాయని సమాచారం వస్తోంది. ఈ విషయంపై కసరత్తు చేస్తున్నట్టుగా టీటీడీ బోర్డు చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి  ప్రకటించారు.

ఒక్కో వ్యక్తికి పది వేల రూపాయలకు టికెట్ ను అమ్మే అవకాశం ఉంటుందని, అలా ఒక్కో కుటుంబానికి గరిష్టంగా పది టికెట్లను తొంభై తొమ్మిది వేలకు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ డబ్బులు టీటీడీ కి చేరతాయి. దీని వల్ల సంస్థకూ నిధులు చేరతాయి.

ఆర్థిక శక్తి ఉంటే సామాన్యులు  కూడా డబ్బులు చెల్లించి బ్రేక్ దర్శనాల్లో స్వామి వారిని చూసుకోవచ్చు. ఇది వరకూ ఇలాంటి వ్యాపారం ఒకటి నడించింది. కొంతమంది  దళారీలు తయారు అయ్యి - స్వామి వారి బ్రేక్ దర్శనం టికెట్లను అమ్ముకునే దందా సాగించారు. అలాంటి వారు బ్రేక్ దర్శనం టికెట్లను పదివేల రూపాయలకు తగ్గకుండా అమ్ముకున్నారు.

అంతకు మించిన ధరకు కూడా అమ్ముకున్నారు. అలాంటి దళారీ వ్యవస్థకు చెక్ పెట్టి - డైరెక్టుగా టీటీడీనే ఆర్థిక శక్తి - ఆసక్తి ఉన్న సామాన్యులకు బ్రేక్ దర్శనం టికెట్లను అందే  ఏర్పాట్లు  చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
Tags:    

Similar News