మంత్రి ఆదికి షాక్‌!.. హెచ్ ఆర్సీ విచార‌ణ స్టార్ట్‌!

Update: 2017-08-22 04:32 GMT
షాక్‌ల మీద షాకులు! ఉప ఎన్నిక‌ల ముందు వ‌రుస దెబ్బల‌ మీద దెబ్బ‌లు!! అధికారం ఉంది క‌దా అని ఏం మాట్లాడినా.. ఏం చేసినా చెల్లుతుంది క‌దా అని భావిస్తున్న టీడీపీ నేత‌ల‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. అధికార మ‌దంతో రాజ్యాంగాన్ని కూడా అప‌హాస్యం చేసేలా టీడీపీ మంత్రులు చేస్తున్న వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల‌ను విస్మ‌యానికి గురి  చేస్తున్నాయి. ద‌ళితులను కించ‌ప‌రిచేలా - వారి హ‌క్కులకు భంగం క‌లిగేలా మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాయి. ద‌ళిత వ‌ర్గాలన్నీటీడీపీ ప్ర‌భుత్వంపై అగ్గిమీద గుగ్గిలంలా మారాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు హెచ్ ఆర్సీ తీవ్రంగా స్పందించింది.

`శుభ్రంగా ఉండరు.. వాళ్ల‌కు చదువు రాదు.. ఎన్ని అభివృద్ధి చ‌ర్య‌లు చేప‌ట్టినా, ఎన్ని వసతులు కల్పించినా దళితులు మారరు` అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేసి.. అధికార మ‌దాన్ని చూపించారు ఫిరాయింపు ఎమ్మెల్యే - మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి! స్వాతంత్ర్య దినోత్స‌వం రోజు.. ద‌ళితుల‌ను అవ‌మాన‌ప‌రుస్తూ మాట్లాడిన ఆయ‌న‌పై.. రాష్ట్రవ్యాప్తంగా నిర‌స‌న జ్వాల‌లు రేగాయి. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఈ అనుచిత వ్యాఖ్యలు చేసిన విష‌యం తెలిసిందే.  ఆదినారాయణరెడ్డి వ్యాఖ్య‌ల‌పై ఓ వ్యక్తి మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ ఆర్‌ సీ)ను ఆశ్ర‌యించారు.

దళితులను కించపరిచిన ఆయనపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ ‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మేడ కృష్ణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్‌ ఆర్సీ స్పందించి అక్టోబర్ 31వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కడప ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఇది తెలుగుదేశం పార్టీకి - మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డికి పెద్ద షాక్‌ గానే చెప్పుకోవాలి. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. ద‌ళితుల‌పై ఇలాంటి నోటిదురుసు వ్యాఖ్య‌లు చేయ‌డం తెలిసిందే!
Tags:    

Similar News