నవ్యాంధ్ర వ్యవహారాల్లో చక్రం తిప్పుతున్న ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అనుకోని చిక్కుల్లో పడ్డారు. పాత కేసు ఒకటి ఆయన్ను ఇంకా వెంటాడుతోంది. గతంలో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసును ప్రోబ్ అనే సంస్థ తాజాగా తవ్వి తీస్తోంది. వాటిని ప్రస్తావిస్తూ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో తొలిసారి చంద్రబాబు మంత్రివర్గంలో ఒక మంత్రి వివాదంలో ఇరుక్కోనుండడంతో చంద్రబాబు కూడా ఆయనపై చిరాకుపడుతున్నట్లు తెలుస్తోంది.
2010లో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి, పుస్తకాలు ప్రింటుచేసి, అమ్మినందుకు తెలుగు అకాడమి హైదరాబాద్ నారాయణగూడ పోలీసుస్టేషన్ లో అప్పటి నారాయణ విద్యా సంస్థల అధిపతిగా ఉన్న పి. నారాయణపై క్రిమినల్ కేసు నమోదుచేసింది. ఐదు కీలకమైన పాఠ్య విభాగాలకు సంబంధించి పంపిణీ, ముద్రణ బాధ్యతలను ఇంటర్ బోర్డు, ప్రభుత్వం తెలుగు అకాడమికి అప్పగించింది. ఆ ప్రకారంగా కాపీరైట్ హక్కులన్నీ అకాడమీకే చెందుతాయి. కానీ నారాయణ విద్యాసంస్థల అధిపతిగా ఉన్న ఇప్పటి మంత్రి నారాయణ దానిని ఉల్లంఘించి, ఆయన ఎండీగా ఉన్న నైమిష మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్, తెలుగు అకాడెమీకి చెందిన స్టడీ మెటీరియల్ ను అక్రమంగా మళ్లీ ముద్రించి అమ్ముకుంది. ఇది ఇండియన్ కాపీరైట్-1957 చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని ప్రోబ్ సంస్ధ తాజాగా ఎన్నికల సంఘానికి వివరించింది. అప్పట్లో దీనిని గ్రహించిన అకాడమీ అధికారులు, నారాయణ విద్యాసంస్థల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదుచేసింది. ఆ ప్రకారంగా ఇప్పటి మంత్రి అయిన నాటి నారాయణ విద్యాసంస్థల అధినేత పి.నారాయణ - పి. దేవి - పి.సింధూరను ఏ1 -ఏ2 -ఏ3లుగా కేసులు నమోదు చేశారు. నారాయణగూడ పోలీసుస్టేషన్ లో ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. కోర్టు నుంచి ఎలాంటి వెసులుబాటు, ఊరట లభించలేదని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
అయితే... తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గవర్నర్ కోటా అభ్యర్ధిగా నారాయణ నామినేషన్ దాఖలు చేసినప్పుడు, ఈ వాస్తవాలను తన అఫిడవిట్ లో పేర్కొనకుండా మోసం చేశారని ప్రోబ్ సంస్థ ఇప్పుడు తన తాజా ఫిర్యాదులో పేర్కొంది. ఇది ఎన్నికల సంఘాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేయడమే కాకుండా, ఎన్నికల నిబంధ నలను కావాలని ఉల్లంఘించడమేనని, అందుకు ఆయనను అనర్హుడిగా ప్రక టించాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్నికల్లో పోటీ చేసే ఏ అభ్యర్ధి అయినా, తన నేరచరిత్ర గురించి ఫారం -26లో పేర్కొ నాలని ఎన్నికల నిబంధన స్పష్టం చేస్తోంది. అలా కాదని తమ నేరాలను దాచిపెట్టినట్టయితే, సదరు అభ్యర్థి ఒకవేళ గెలిచినా తర్వాత అతనిపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఇప్పుడు కానీ ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంటే నారాయణ పదవికి ఎసరొచ్చేలాగానే ఉంది. ఒకవేళ ఎన్నికల సంఘం పెద్ద మనసు చేసుకుందామనుకున్నా ప్రతిపక్షం దీన్ని రచ్చ చేయకుండా ఉంటుందన్న నమ్మకమూ లేదు. కాబట్టి నారాయణకు కష్టాలు మొదలైనట్లే ఉన్నాయి.