తెలుగు రాష్ట్రాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడుస్తున్న డేటా స్కామ్ గురించే చర్చంతా. ఏంటీ డేటా స్కామ్..? ఎక్కడ మొదలైంది..?అసలు డేటాలో ఏముంది..? నిజంగానే ప్రజల వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లిందా..?అదే నిజమైతే అది బయటకు ఎలా వెళ్లింది..?ఇందుతో టీడీపీ సేవా మిత్ర యాప్ రోల్ ఏంటి..? వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత..?టీడీపీ చెబుతోంది నిజమేనా..? వీటిన్నింటికి సమాధానాలు ఆసక్తి మారాయి.
ఎన్నికల వేళ డేటా స్కామ్ పేరుతో నడుస్తున్న రాజకీయం ఏపీని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లో వాతావరణం వేడెక్కించింది. టీడీపీ యాప్ సేవా మిత్ర, ఐటీ కంపెనీలు ఐటీ గ్రిడ్స్, లూఫ్ రాక్ మొబైల్ టెక్నాలజీల చుట్టూ ఈ వ్యవహారం తిరుగుతోంది. మధ్యలో ఏపీ ప్రభుత్వ సమాచార కేంద్రం ఆర్టీనీయస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
*అసలు ఈ యాప్ ఏంటి?
టీడీపీ సేవా మిత్ర యాప్ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించింది. పార్టీ కిందిస్థాయి నుంచి క్రీయాశీలక కార్యకర్తలు ఇందులో సభ్యులుగా ఉన్నారు. గ్రామస్థాయిలో పోలింగ్ బూత్ లో ఉండే ఓటర్ల సంఖ్యను బట్టి సేవా మిత్రలు ఉంటాయి. వారికి ఒకరు హెడ్ గా ఉంటారు. ఇలా మండలం, నియోజకవర్గం, రాష్ట్రస్థాయిలో ఈ యాప్ పనిచేస్తోంది. పార్టీ కార్యకలాపాలన్నీ ఈ యాప్ ద్వారానే జరుగుతాయి.
*యాప్ ద్వారా ఏం చేస్తారు.?
ఈ యాప్ ద్వారా పార్టీ హైకమాండ్ నుంచి వచ్చే ఆదేశాలు సైతం అందుతాయి. ఇందులో భాగంగా సేవామిత్ర సభ్యులు గ్రామాల్లోని ఓటర్ల సమాచారాన్ని అప్ డేట్ చేశారు. అంతేకాకుండా ప్రతి ఓటరు పూర్తి డేటా తాను పొందుతున్న పథకాల వివరాలు నమోదై ఉంటాయి. దీంతో ఆ ఓటరు దేనికి ఓటు వేస్తారనే విషయం బయటపడుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.
*యాప్ ను ఎవరు నిర్వహిస్తున్నారు.?
ఈ సేవా యాప్ ను హైదరాబాద్ లోని ఐటి గ్రిడ్ సంస్థ డెవలప్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఏపీలో కొద్దిరోజుల కిందట ప్రభుత్వ ప్రజాసాధికారిత సర్వే చేయించింది. ఆ వివరాలన్నీ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ లో ఉంచింది. ఇందులో కుటుంబ సభ్యులు డేటాతో పాటు బ్యాంకు అకౌంట్లు, ఆధార్ నెంబర్లు తదితర సమారామంతా ఉందని వైసీపీ అంటోంది. ఈ సమాచారమంతా సేవా మిత్ర యాప్ నిర్వహిస్తున్న ఐటీగ్రిడ్ సంస్థకు ఎలా వచ్చిందని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఏపీ డేటా సెంటర్ ద్వారా మధ్యలో ఆర్టీజీఎస్ ద్వారా విశాఖలోని బ్లూఫ్రాగ్ కంపెనీకి చేరుతోందని, అక్కడి నుంచే ఐటీ గ్రిడ్స్ కు చేరుతోందని అంటున్నారు వైసీపీ నాయకులు.
*ప్రజల వ్యక్తిగత సమాచారంతో కుట్రలు
సేవా మిత్ర పార్టీ యాప్ అయితే ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా ఉందని ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఈసీ వద్ద మాత్రమే ఉన్న కలర్ ఫొటోలు సేవా మిత్ర యాప్ లోకి ఎలా వచ్చాయని అంటున్నారు. ఈ వ్యవహారం బయటికి రాగానే సేవామిత్ర యాప్ ను అప్ డేట్ చేసి వివరాలన్నీ మార్చేశారంటున్నారు వైసీపీకి చెందిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే ప్రజలకు సంబంధించిన డేటా ప్రభుత్వ వెబ్ సైట్ లోనే ఉందని, అలాంటప్పుడు వాటిని చోరీ చేయాల్సిన అవసరం ఏముందని టీడీపీ వాదిస్తోంది. కానీ ప్రజల డేటా సేకరించి ఓట్లు దండుకునే ఈ కుట్రను వైసీపీ కనిపెట్టింది. ఇప్పుడు తెలంగాణ పోలీసుల విచారణలో టీడీపీ చేసిన మాయా ఓట్ల కహానీ బయటపడుతోంది.
*ప్రభుత్వ డేటాతో టీడీపీ నాటకాలు
ఏపీలో ప్రభుత్వంలో ఉండడంతో ప్రజల జీవన, సామాజిక సమీకరణాలన్నీ టీడీపీ ప్రభుత్వం రహస్యంగా సేకరించిందన్న అనుమానాలకు బలం చేకూరుతున్నాయి. అలా సేకరించిన సమాచారాన్ని తమ అనుంగ ఐటీ సంస్థల ద్వారా విశ్లేషించి ఓట్లను కొనుగోలు చేయడానికి.. వ్యతిరేకుల ఓట్లను తీసేయడానికి టీడీపీ కుట్ర పన్నిందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ బలంతో టీడీపీ చేసిన ఈ అక్రమాలు.. ఆధార్ దుర్వినియోగం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ కేసులో పెద్ద తలకాయలు ఇరుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.