సార్వత్రిక ఎన్నికల వేళ పొత్తుల ఎత్తులు కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడం లేదు. దేశరాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి వెళుదామని భావించిన కాంగ్రెస్ పార్టీ పొత్తుల విషయంలో బేరసారాలు బెడిసికొట్టడంతో అంతర్మథనంలో పడిపోయింది. ఉమ్మడి శత్రువు బీజేపీ కోసం ఒక్కటవుదామని భావించిన ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ లు సీట్ల సర్దుబాటు తేల్చలేక చేతులెత్తేశాయి.
ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ కలిస్తే పోయిన సారి గణాంకాల ప్రకారం.. ఓట్ల శాతం బీజేపీని మించిపోతుంది. శత్రువుకు శత్రువు మిత్రుడు కావడంతో ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేయాలనుకున్నాయి. కానీ సీట్ల సర్దుబాటు తెగలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ సొంతంగా సర్వే చేయించుకున్నట్టు సమాచారం. రాజధాని ఢిల్లీలో బీజేపీకి 35శాతం ఓటు శాతం వస్తుందని.. ఆమ్ ఆద్మీకి 28శాతం, కాంగ్రెస్ కు 22శాతం ఓట్ల శాతం వచ్చిందట.. దీంతో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ విడిపోయి పోటీచేస్తే బీజేపీ గెలుస్తుందని తేలింది.
ఈ సర్వే ఫలితాల అనంతరం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ తమ నిర్ణయాన్ని పున: సమీక్షించుకొని కలిసి పోటీచేయాలని భావిస్తున్నాయి. కాంగ్రెస్, ఆప్ కలిస్తే ఓట్ల శాతం 50శాతానికి చేరుకుంటుంది. దీంతో మళ్లీ పొత్తు పొడిచేందుకు ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.
ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తాజాగా ఆప్ తో పొత్తు అవసరమని రాహుల్ గాంధీకి సూచించారట.. ఒంటరిగా పోటీచేస్తే గెలువలేమని కుండబద్దలు కొట్టారట.. ఆప్ తో పొత్తును వ్యతిరేకిస్తున్న ఢిల్లీ మాజీ సీఎం , పీసీసీ చీఫ్ షీలా దీక్షిత్ సైతం.. సర్వే ఫలితాలతో ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.
ఈ పరిణామాలతో వేగంగా స్పందించిన కాంగ్రెస్ సీనియర్లు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ లు ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ తో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ, హర్యానాలోనూ ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీచేయాలని కాంగ్రెస్ సీనియర్లు కోరారట.. ఢిల్లీలోని మొత్తం 7 లోక్ సభ సీట్లలో ఏడింట్లో ఆప్ అయిదు స్థానాలు, కాంగ్రెస్ రెండు స్థానాల్లో పోటీచేయాలని క్రేజీవాల్ ప్రతిపాదించాడట.. కానీ రాహుల్ మాత్రం మూడు స్థానాలు కావాలంటూ పట్టుబట్టడంతో సీట్ల సర్దుబాటు బెడిసికొట్టినట్లు సమాచారం.