తెలంగాణ ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం

Update: 2018-11-12 07:26 GMT
తెలంగాణ ఎన్నికల్లో గెలుపోటముల లెక్కలను అన్ని పార్టీలు వేసుకుంటున్నాయి. అనుకూల ప్రతికూల అంశాలతో పాటు సామాజిక వర్గాలపరంగా ఓట్లను గాలం వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అత్యధిక స్థానాల్లో ప్రధాన ఓటింగా ఉన్న గల్ఫ్‌ కార్మికులపై దృష్టి పెట్టారు. ఉత్తర తెలంగాణలోని 25  నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉన్నారు.

తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు సుమారు  13 లక్షల మంది వెళ్లి ఉన్నట్లు అంచనా. వీరిని ఆకర్షించేందుకు పోటాపోటీ పథకాలను ప్రవేశపెడుతున్నాయి టీఆర్ ఎస్ - కాంగ్రెస్‌ పార్టీలు.   గత ప్రభుత్వ విధానాల వల్లే  దేశం విడిచి వెళ్తున్నారని  టీఆర్ ఎస్‌ విమర్శిస్తోంటే.. గల్ఫ్‌ కార్మికులను ఆదుకోవడంలో టీఆర్ ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అధికారంలోకి రాగానే,  ఆదకునేందుు బడ్జెట్‌ లో నిధులు కేటాయిస్తామని చెబుతున్నారు. 

ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌ దేశాలకు  వెళ్తున్న వారిలో 80 శాతానికిపైగా నైపుణ్యం లేకుండా కేవలం కూలీ పనుల కోసమే వెళ్తున్నారు.  దళారులు కూడా వీరిని దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో వీరి స్థితిగతులను పట్టించుకోని పార్టీలు.. ఎన్నికల సమయంలో సంక్షేమం కోసం పాటుపడతామని హామీలు ఎక్కుపెడుతున్నారు. సదరు అంశాలను  మేనిఫెస్టోలో చూపుతున్నాయి.  ఇప్పటికే టీపీసీసీ ప్రతినిధి బృందం గల్ఫ్‌ దేశాల్లో పర్యటించింది. ఇబ్బందులు తెలుసుకున్నామని వరాల జల్లు కురిపించడం మొదలుపెట్టారు.  దాంతో అప్రమత్తమైన టీఆర్ ఎస్‌ ఎంపీ కవిత.. గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన - చేయబోయే   కార్యక్రమాలను వివరించారు.

ఏదిఏమైనా - గల్ఫ్‌ కార్మికుల కోసం  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేసిన సేవలను మరచిపోలేకపోతున్నారు.  సంక్షేమం కోసం ప్రత్యేక విభాగం, ఓ మంత్రిని నియమించిన  కార్మికుల గుండెల్లో చిరస్మరణీయంగా ఉన్నారు. గల్ఫ్‌లో మరణించిన వారి కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.  రాయితీ రుణాలను అందజేశారు.  గల్ఫ్‌ దేశాల్లో క్షమాభిక్షను అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తే చట్ట విరుద్ధంగా ఉన్న కార్మికులను స్వరాష్ట్రానికి క్షేమంగా తీసుకొచ్చేందుకు చొరవ చూపింది. నాడు వైఎస్‌ తీసుకున్న చర్యలను ఇప్పటి రాజకీయ పక్షాలు తమ మేనిఫెస్టోలలో చేర్చాలని కార్మికులు కోరుతున్నారు.  

Tags:    

Similar News