తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం హుజురాబాద్ చుట్టూనే తిరుగుతోంది. ఈ ఉప ఎన్నిక కచ్ఛితంగా రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయటం ఖాయం. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండి.. ఆయనతో తేడా వచ్చి బయటకు వచ్చిన ఈటల రాజకీయ భవిష్యత్తును ఈ ఉప ఎన్నిక డిసైడ్ చేయనుంది. ఎంతటోడైనా సరే తన వద్ద ఉన్నంతవరకు.. తన నుంచి బయటకు వెళ్లిపోతే.. రాజకీయంగా డమ్మీనే అన్న నమ్మకం.. ధీమా కేసీఆర్ లో ఎక్కువని చెబుతారు. ఆ విషయాన్ని కూడా హుజురాబాద్ ఉప ఎన్నిక తేల్చనుంది.
ఈ ఉప ఎన్నికకు అధికార టీఆర్ఎస్ తన అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ఎంపిక చేయగా.. బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కిందామీదా పడుతోంది. పలు పేర్లు ఆప్షన్లుగా ఉన్నప్పటికి.. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని భావిస్తోంది. ఇందుకోసం తాజాగా భేటీని నిర్వహించిన పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. చివరగా.. హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు కొండా సురేఖను రంగంలోకి దించాలని డిసైడ్ అయ్యింది. ఈ పేరును కాంగ్రెస్ అధినాయకత్వం దాదాపుగా ఫైనల్ చేసిందని.. అధికారికంగా ప్రకటించటమే ఆలస్యమన్న మాట వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో హుజురాబాద్ అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిందని చెబుతున్నారు. ఈ చర్చల్లో అంతిమంగా సురేఖ పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖను హుజురాబాద్ కు ఎందుకు తీసుుకొస్తున్నారు? ఆమెను బరిలోకి దింపటం వల్ల కలిగే లాభమేంటి?అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి పక్కా వ్యూహం ఉందంటున్నారు.
కొండా సురేఖ కాకుండా మిగిలిన ఆప్షన్లు ఏమున్నాయన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ చర్చ జరిపినప్పుడు.. కవ్వంపల్లి సత్యనారాయణ, కృష్ణారెడ్డి, ప్యాట రమేష్ పేర్లను కాంగ్రెస్ పరిశీలించినప్పటికి.. ఫైనల్ గా మాత్రం కొండా సురేఖను డిసైడ్ చేశారంటున్నారు. ఎవరెన్నిచెప్పినా హుజురాబాద్ బీసీ సామాజిక వర్గం చుట్టూనే తిరుగుతోంది. నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గానికే మెజార్టీ. ఈటల రాజేందర్ సైతం బీసీ కార్డునే ఉపయోగిస్తున్నారు. ఈ కారణంతోనే ఆయన్ను ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్ ఆయన్ను ‘సగం బీసీ.. సగం ఓసీ’ అంటూ నేరుగానే దాడి చేస్తోంది.
ఈ క్రమంలో కొండా సురేఖ ఎంపికలోనూ వ్యూహం ఉందంటున్నారు. సురేఖది పద్మశాలి సామాజిక వర్గం కాగా.. ఆమె భర్త కొండా మురళీది మున్నూరు కాపు సామాజిక వర్గం. ఈ రెండు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో.. కనీసంఈ రెండు సామాజిక వర్గాలకు చెందిన ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉందంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక మీద గెలుపు ఆశలు కాంగ్రెస్ కు లేనప్పటికీ.. తమ ఉనికిని చాటేలా ఓట్లు వస్తే అదే పదివేలన్న మాట వినిపిస్తోంది. 2018లో రెండోసారి కేసీఆర్ సర్కారు కొలువు తీరాక జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన వేళ.. తాజా ఉప ఎన్నికల్లో గౌరవప్రదమైన ఓట్లను సొంతం చేసుకోవాలన్న తహతహ కనిపిస్తోంది. ఇందులో భాగంగానే కొండా సురేఖను బరిలోకి దిగేందుకు ఒప్పించినట్లుగా చెబుతున్నారు. మరి..అధికారిక ప్రకటన ఎప్పుడో చూడాలి.