బీజేపీకి షాకిచ్చిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు!

Update: 2018-03-01 04:29 GMT
ఇటీవ‌ల కాలంలో బీజేపీకి కాలం క‌లిసి రావ‌టం లేదు. ఎక్క‌డ చూసినా ఏదోలా  ఎదురుదెబ్బ‌లే త‌గులుతున్నాయి.  ఒక‌టి త‌ర్వాత ఒక‌టి అన్న‌ట్లుగా మోడీ స‌ర్కారు ఇమేజ్ డ్యామేజ్ చేసే ప‌రిణామాలు ఎదురువుతున్నాయి. నీర‌వ్ మోడీ ఉదంతం మోడీ స‌ర్కారు నాలుగేళ్ల ఇమేజ్ ను రాత్రికి రాత్రి మ‌స‌క‌బారేలా చేసింది. ఇక‌.. పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీతో స‌హా.. ఏపీకి మోడీ స‌ర్కారు ఇచ్చిన హ్యాండ్ చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు.

 మోడీ ఏ మాత్రం విశ్వ‌స‌నీయ‌మైన నేత కాద‌న్న భావ‌న‌ను క‌ల‌గ‌జేయ‌ట‌మేఏ కాదు.. ఆయ‌న మాట‌లు చెప్పేంత‌గా ప‌ని చేయ‌ర‌న్న ఇమేజ్ ను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. తాజాగా వెలువ‌డిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు క‌మ‌ల‌నాథుల్లో క‌ల‌క‌లం రేపేలా మారాయి. ఆ మ‌ధ్య‌న చోటు చేసుకున్న ప‌రిణామాల కార‌ణంగా ఖాళీ అయిన మూడు అసెంబ్లీ స్థానాల‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ్గా.. అందులో రెండు కాంగ్రెస్ ఖాతాలో ప‌డ‌గా.. మ‌రొక‌టి ఒడిశా అధికార‌ప‌క్షం ఖాతాలోకి చేరింది.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ప‌వ‌ర్ లో ఉన్న బీజేపీకి షాకిస్తూ.. రెండు స్థానాల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. ఈ ప‌రిణామం బీజేపీకి ఇబ్బందిక‌రంగా మారింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని కోలార‌స్.. ముంగావ‌లి అసెంబ్లీ స్థానాల‌కు చెందిన ఎమ్మెల్యేలు ఇటీవ‌ల మ‌ర‌ణించారు. దీంతో.. అక్కడ ఉప ఎన్నిక‌లు నిర్వ‌హించారు. ఈ రెండు స్థానాల్ని విప‌క్ష కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించింది.

ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అధికార బీజేపీ ఎంత‌గా ప్ర‌య‌త్నించినా విజ‌యం మాత్రం సాధ్యం కాలేదు. ముంగావ‌లిలో 2,124 స్వ‌ల్ప అధిక్య‌త‌తో బీజేపీ అభ్య‌ర్థిపై విజ‌యం సాధించ‌గా.. కోలార‌స్ లో 8,083 ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థిపై కాంగ్రెస్ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు.

ఇక‌.. ఒడిశాలో జ‌రిగిన మ‌రో ఉప ఎన్నిక‌ల్లో పాల‌క బీజేడీ అభ్య‌ర్థి విజ‌యం సాధించారు. వాస్త‌వానికి ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్య‌ర్థి మ‌ర‌ణంతో జ‌రిగింది. ఈసారి ఒడిశా ఎన్నిక‌ల్లో పాల‌క బీజేడీకి ధీటుగా నిలుస్తామ‌ని భావిస్తున్న వేళ‌.. అందుకు భిన్నంగా బీజేపీ త‌న ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. అదే స‌మ‌యంలో అధికార ప‌క్షం భారీ మెజార్టీతో విజ‌యం సాధించ‌టంతో  బీజేపీ శిబిరంలో నిరాశ నిస్పృహ‌లు చోటు చేసుకున్నాయి.
Tags:    

Similar News