రాజకీయ ప్రత్యర్థులు కలిసి ఏం చేశారంటే..?

Update: 2018-11-02 10:58 GMT
రాజకీయ ప్రత్యర్థులంటే ఎలా ఉంటారు. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటారు.. కానీ ఇక్కడ ప్రత్యర్థులు కులాసాగా ఒకరి ఆఫీసులోకి మరొకరు వెళ్లి కరాచలనం చేసుకున్నారు. తనకు ఓటు వేయాలని ఒకరు అభ్యర్థించారు.దానికి ప్రత్యర్థి సానుకూలంగా స్పందించాడు. ఈ అనూహ్య సంఘటన గోషామహల్ నియోజకవర్గంలో చోటుచేసుకుంది..

బీజేపీ నుంచి 2014 ఎన్నికల్లో గోషామహల్ నుంచి గెలిచిన తాజామాజీ ఎమ్మెల్యే  రాజాసింగ్ ప్రస్తుతం మళ్లీ అక్కడి నుంచే పోటీచేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.  మరో వైపు ఇక్కడి నుంచే మహాకూటమి పొత్తులో తనకు సీటు దక్కుతుందని భావించి కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ గౌడ్ ప్రచారం మొదలు పెట్టారు.

తాజాగా ఈరోజు ప్రచారంలో భాగంగా ముఖేష్ గౌడ్ గోషామహల్ నియోజకవర్గంలోని ఇంటింటికి తిరుగుతూ తనకు ఓటు వేయాలని కోరడం మొదలుపెట్టారు. ముఖేష్ ప్రచారం చేస్తున్న సమీపంలోనే బీజేపీ కార్యాలయం ఉంది. అందులోకి కూడా ముఖేష్ వెళ్లి అక్కడే ఉన్న రాజాసింగ్ ను కలిశారు. నీ ఓటు నాకే వేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ ను కోరారు. వారిద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకొని చేయి చేయి కలిపి ఫొటోలకు ఫోజిచ్చారు. పరస్పరం అప్యాయంగా నవ్వుతూ పలకరించుకున్నారు.

ఎన్నికల వేళ కత్తులు దూసుకునే ఎమ్మెల్యే అభ్యర్థులను చూసిన జనం ఇలా ఇద్దరూ కలిసి పోయి అప్యాయంగా   ప్రచారం చేసుకుంటున్న వైనం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి వీడియో తెగ సర్య్కూలేట్ అవుతోంది. 
   

Tags:    

Similar News