తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ బలపడకుండా ఉండడానికి టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నో ప్లాన్లు వేశారని చెబుతుంటారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులను కూడా పెట్టారని కాంగ్రెస్ సీనియర్లు గతంలో ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీలోనూ అలాంటి విమర్శలే రావడం చర్చనీయాంశంగా మారాయి.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఇటీవలే మొదట శ్రీకళారెడ్డిని తెరపైకి తెచ్చారు. ఆమె ఇటీవలే బీజేపీలో చేరారు. బీజేపీలోని సీనియర్లకు సైతం చెప్పకుండా ఆమెను అభ్యర్థిగా ప్రకటించడం దుమారం రేపింది. ఎంతో మంది బలమైన నేతలు పోటీచేస్తామన్నా వారికి ఇవ్వకుండా శ్రీకళారెడ్డి పేరు తెరపైకి రావడం పార్టీలో చిచ్చుపెట్టింది. దీనిపై నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో ఆమె అభ్యర్థికాదని బీజేపీ రాష్ట్ర నాయకత్వం స్పష్టతనిచ్చింది.. మరో అభ్యర్థి పేరును తెరపైకి తెచ్చింది. ప్రస్తుతానికి హుజూర్ నగర్ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
అయితే బీజేపీ అభ్యర్థిగా మొదట శ్రీకళా రెడ్డి పేరును వ్యూహాత్మకంగా లీక్ చేసినట్టు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతల కనుసైగల్లోనే బలహీన అభ్యర్థి అయిన శ్రీకళారెడ్డి పేరును తీసుకొచ్చారని.. కాంగ్రెస్ నేతలే బీజేపీలో టికెట్ల వ్యవహారం నడుపుతున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. శ్రీకళారెడ్డి బరిలోకి దిగితే హుజూర్ నగర్ లో బీజేపీ పోటీయే ఉండదన్న టాక్ నడుస్తోంది. బీజేపీలోని కాంగ్రెస్ కోవర్టులే ఈమెను బరిలోకి దింపడానికి కోవర్ట్ గేమ్ ఆడినట్టు బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
హుజూర్ నగర్ లో బలం లేని బీజేపీ.. వ్యూహాత్మకంగానే ఇక్కడ బలమైన టీఆర్ ఎస్ ను ఓడించడానికి కాంగ్రెస్ కు ఇన్ డైరెక్ట్ సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యిందన్న ప్రచారం సాగుతోంది. అందుకే కాంగ్రెస్ డైరెక్షన్ మేరకు బలహీన అభ్యర్థిని బీజేపీ తెరపైకి తెచ్చిందన్న వాదన గులాబీ పార్టీలో సాగుతోంది. ఇలా బీజేపీలో ఇప్పుడు కాంగ్రెస్ కోవర్టుల వ్యవహారంపై ఆపార్టీలోని ఆశావహుల్లో కలకలం రేపుతోందట..