ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాబినెట్ లోని మంత్రివర్గ సహచరులపై మొదటిసారిగా అవినీతి ఆరోపణలు వచ్చాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.450 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. అంతే కాకుండా తగిన ఆధారాలు కూడా తమ ఉన్నాయని స్పష్టం చేశారు. సదరు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ కాగా...ఆయనపై ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాల.
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు సొంత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భారీ స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్లు ఇటీవలే స్థానిక చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ రిపోర్ట్ ను విడుదల చేశారు. పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం సుమారు 450 కోట్ల అవినీతి జరిగినట్లు సీవీసీ తన నివేదికలో పేర్కొన్నారు. ఆ జాబితాలో అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజూ పైన కూడా ఆరోపణలు వచ్చాయి. రిజిజూ నియోజకవర్గమైన వెస్ట్ కామింగ్ లోనే 600 మెగావాట్ల జల విద్యుత్తు ప్రాజెక్టును నిర్మిస్తున్న నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర మంత్రి రిజిజూ పాత్రపై అనుమానాలు ఉన్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. కేంద్ర మంత్రి వర్గం నుంచి రిజిజూను తొలిగించాలని సుర్జేవాల డిమాండ్ చేశారు. రిజిజూ అవినీతికి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఆడియో టేపులు కూడా తమ దగ్గర ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/