తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివిధ దశల్లో జరిగిన ఎన్నికలల్లో గెలుపు అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. నారాయణఖేడ్ ఉప ఎన్నికతోనైనా ఈ అపవాదును చెరిపేసుకుంటారా? లేక? పరాజయాల పరంపరను మూటగట్టుకుంటారా? అనే చర్చోపచర్చలు జరిగిన సమయంలో అక్కడా ఓటమి తప్పలేదు. కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కినప్పటికీ అది మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డిపై అభిమానంతో ఓటు వేసిన వారేనని చెప్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దలు ఉత్తమ్ సీటుపై దృష్టిసారించినట్లు అభిప్రాయపడుతున్నారు.
పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి కాంగ్రెస్ కు కలిసి రావడంలేదు. ఆయన కాలంలో జరిగిన ఏ ఎన్నికలల్లో చూసినా డిపాజిట్ గల్లంతైన రికార్డులే తప్ప గెలుపన్నదే అందకుండా పోతోంది. వరంగల్ ఉప ఎన్నిక - స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, తాజాగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 150 వార్డులకు జరిగిన ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితం కావడం పార్టీ ఘోర పరాజయానికి ఉదాహరణలని చెప్తున్నారు. గత జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం తోకలిసి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకున్న పార్టీకి కేవలం రెండు స్థానాలా అంటూ నాయకులు వాపోతున్నారు.
నారాయణఖేడ్ ఉప ఎన్నిక ఫలితాన్ని పరిగణనలోకి తీసుకొని పార్టీని ప్రక్షాళన చేసే దిశగా ఏఐసీసీ కసరత్తు చేయనున్నట్లు ముందునుంచే వార్తలు వెలువడ్డాయి. ఎన్నికల క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న క్యాడర్ ను పార్టీ శ్రేణులు వినియోగించుకుంటున్నారా? జిల్లా కమిటీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారా? పార్టీ ముఖ్యనేతల మధ్య ఏమాత్రం సఖ్యత ఉంది అనే కొలబద్దల ప్రకారం చూస్తే ఉత్తమ్ ర్యాంకింగ్ పూర్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది. వరుస ఓటములకు తోడు పార్టీలో ఉన్న గందరగోళ పరిస్థితులను పక్కనబెట్టి, ఐక్యంగా ముందుకు సాగే ఆనవాళ్లే కనబడటం లేదని నాయకులే చెప్తున్నారు. సాక్షాత్తూ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ - శాసనమండలి సభ పక్ష నేత షబ్బీర్ అలీపై పాతబస్తీలో ఎంఐఎం నేతలు దారుణంగా దాడి చేయడం, దానిపై పార్టీ దూకుడుగా ముందుకు పోవడం సైతం ఢిల్లీ పెద్దలకు అవమానంగా తోచింది. మరోవైపు దాడి ఘటనను సీనియర్ నేత వి.హనుమంతారావు ఖండిచకపోగా వారి నాయకత్వం ఇలా ఉందని అవహేళన చేయడంతో పార్టీలోని విబేధాలు బయటపడ్డాయి. తనకు పూర్తి స్థాయి అధికారం ఇవ్వలేదంటూనే... గ్రేటర్ ఓటమికి బాధ్యత వహించి దానం నాగేందర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా...రంగారెడ్డి డిసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ సైతం అదేబాటలో నడిచారు.
ఈ నేపథ్యంలో తాజాగా సిట్టింగ్ స్థానమైన నారాయణ్ ఖేడ్ లో ఓటమి ఎదురైంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ప్రక్షాళన చేస్తేగానీ బతికి బట్టకట్టదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. తాజా ఓటమి, ఢిల్లీ స్థాయిలో ఉన్న అభిప్రాయాలతో ఉత్తమ్ పదవి ఊస్టేనని వార్తలు వెలువడుతున్నాయి.