తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులకు కాంగ్రెస అధిష్టానం షాక్ ఇచ్చింది. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఇక ప్రచారం పైనే ద్రుష్టి పెట్టాలని నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ పార్టీ సీనీయర్ నాయకులు వి. హనుమంత రావు - జైపాల్ రెడ్డి - రేణుక చౌదరి - ఆంధ్రప్రదేశ్ నాయకులు కె. రామాచంద్ర రావు - కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారిని ప్రచారానికి రాకపోయిన పర్వాలేదంటూ సమచారం ఇచ్చినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ సీనీయర్ నాయకులు ప్రచారం పేరుతో గ్రూపులు కట్టడం అసంధర్భ ప్రకటనలు చేయడం వంటివి మానుకోవాలని హెచ్చరించింది. ఎన్నికల ముందు వరకూ ఢిల్లీలోను - హైదారబాదు లోను గడిపిన సీనీయర్ నాయకులు ప్రచారం పేరుతో నియోజక వర్గాలలో తిరిగి లేని పోని ఇబ్బందులు తీసుకు రావద్దని - హెచ్చరించినట్లు సమాచారం. అలాగే ఫలాన వారు ముఖ్యమంత్రి - వారికి ఈ పదవి - వీరికి ఆ పదవి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు కూడా చేయవద్దంటూ అధిష్టానం సూచించింది. జైపాల్ రెడ్డి వంటి నాయకులు అడపా దడపా నేను సీఎం రేసులో లేను అంటూ ప్రకటిస్తారు. అయితే సీఎం రేసులో ఎవరున్నారో.. ఎవరికి ఆ అర్హత ఉందో తామే నిర్ణయిస్తామూ తప్ప - ఇలాంటి ప్రకటనలు చేయవద్దంటూ హితవు పలికారని సమాచారం.
టిక్కెట్ల కేటాయింపు సమయంలో తమ కులానికి అన్యాయం చేసారంటూ రేణుక చౌదరి - బీసీలకు తక్కువ టిక్కెట్లు ఇచ్చారంటూ వి. హనుమంత రావు చేసిన ప్రకటనలపై అధిష్టానం ఆగ్రహంగా ఉంది. తెలంగాణలో ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో, ఏ సామాజిక వర్గాన్ని ఎలా చూడాలో పీసీసీ నాయకులు - అధిష్టానం పంపిన దూతలు చూసుకుంటారని - సీనీయర్ల పేరుతో వ్యాఖ్యానాలు చేయవద్దంటూ కాస్త తీవ్రంగానే మందలించినట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయాలు చేయడం - గ్రూపులు కట్టడంలో దిట్ట అని పేరున్న కేవీపీ రామచంద్రరావును తెలంగాణలో ఎన్నికలు పూర్తయేవరకూ ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని అధిష్టానం హెచ్చరించినట్లు చెబుతున్నారు. తెలంగాణ సీనీయర్ నాయకులు కొందరు కేవీపీ రామచంద్ర రావుకు సన్నిహితులు - వారి ద్వారా అంతర్గత రాజకీయాలు చేసి పార్టీని - మహాకూటమిని ఇబ్బంది పెట్టవద్దని కేవీపీకి సూచించినట్లు చెబుతున్నారు. అలాగే సెట్టిలర్లను ప్రభావితం చేస్తామనే పేరుతో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హైదారాబాద్ లో ప్రచారం చేయాలనుకుంటే కుదరదని కూడా తేల్చి చెప్పేసారుట. దీనికి కారణం తెలంగాణ ఏర్పాటు సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరుతో తెలంగాణలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. సెటిలర్లను ప్రభావితం చేస్తామంటూ ప్రచారానికి వస్తే తెలంగాణ ఓటర్ల నుంచి వ్యతిరేకత వస్తుందని అధిష్టానం భావిస్తోంది. దీని ద్రుష్ట్యా కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీనీయర్లు అందరూ ఆచీ తూచీ వ్యవహరించాలని అధిష్టానం ఆదేశించింది.