జ‌గ్గారెడ్డి కొత్త అజెండా

Update: 2017-10-18 16:43 GMT
జ‌గ్గారెడ్డి. తెలంగాణ ఉద్య‌మం సాగుతుంటే తెలంగాణ ఇవ్వొద్ద‌ని సోనియాగాంధీకి లేఖ రాసిన వ్య‌క్తి. సంగారెడ్డి ప్ర‌జ‌లంతా తెలంగాణ కొర‌కు బంద్ పాటిస్తుంటే షాపులు తెర‌వాల‌ని రోడ్ల మీద తిరిగిన వ్య‌క్తి. అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి అండ‌తో కేసీఆర్ మీద నిత్యం విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ‌డం ఆయ‌న‌కు అల‌వాటు. టీఆర్ ఎస్ నుండి గెలిచిన జ‌గ్గారెడ్డి వైఎస్ అండ‌తో కాంగ్రెస్ లో చేరాడు.

గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌రువాత బీజేపీలో చేరి మెద‌క్ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన జ‌గ్గారెడ్డి ఆ త‌రువాత తిరిగి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నాడు. అయితే తెలంగాణ‌లో కేసీఆర్ కు వ్య‌తిరేకంగా రెడ్డిలంతా ఏకం కావాల‌ని, కేసీఆర్ కు గుణ‌పాఠం చెప్పాల‌ని ఇప్పుడు జ‌గ్గారెడ్డి పిలుపునిస్తున్నాడు. జేఏసీ మూలంగానే తెలంగాణ‌లో ఉద్యోగ‌ - ఉపాధ్యాయ‌ - ప్ర‌జాసంఘాలు భాగ‌స్వాముల‌య్యార‌ని జ‌గ్గారెడ్డి అంటున్నారు.

తెలంగాణ‌తో బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుంద‌ని అనుకుంటే కేసీఆర్ పాల‌న‌లో ఆశ‌లు ఆవిరి అయ్యాయ‌ని, ఉద్య‌మంలో కోదండ‌రాం ముద్దుగా క‌నిపించాడ‌ని, ఇప్పుడు దోషిగా క‌నిపిస్తున్నాడ‌ని జ‌గ్గారెడ్డి కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ‌లో ఎస్సీ - బీసీల‌తో రెడ్డిల‌కు మాత్ర‌మే అనుబంధం అని, వెల‌మ‌లతో ఎలాంటి అనుబంధం లేద‌ని, రెడ్డిలంతా ఏకం కావాల‌ని జ‌గ్గారెడ్డి అంటున్నారు. మ‌రి జ‌గ్గారెడ్డి మాట‌లు ఎంత మంది వింటారో వేచిచూడాలి.
Tags:    

Similar News