కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరో సంచలనానికి తెరతీశారు. యూపీఏ హయాంలో ఎన్నో కీలకమైన మంత్రిత్వశాఖలు నిర్వర్తించిన ఆయన కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రిలయన్స్ సంస్థలకు అనుమతులు ఇవ్వకుండా చాలా కఠినంగా వ్యవహరించారనే పేరుంది. ఒకనొక సమయంలో రిలయన్స్ నుంచి బెదిరింపులు వచ్చినా లెక్క చేయకుండా ముందుకెల్లారనే పేరుంది. అలాంటి అన్ని గుట్టు మట్లు తెలిసిన జైపాల్ రెడ్డి తాజాగా రాఫెల్ వివాదంపై నోరు విప్పారు. ప్రధాని మోడీని అడ్డంగా బుక్ చేశారు.
యూపీఏ హయాంలో సీనియర్ కేంద్రమంత్రిగా ఉన్న జైపాల్ రెడ్డికి రాఫెల్ విమానాల కొనుగోలులో భాగస్వామ్యం ఉంది. ఆయన కేబినెట్ మంత్రి కావడంతో రాఫెల్ కొనుగోళ్ల విషయాలు తెలుసు. అందుకే యూపీఏ సర్కారు కేవలం 21వేల కోట్లకే ఫ్రాన్స్ దేశంతో రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుందని.. కానీ ఇప్పుడు ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా ఏకంగా 36 విమానాలకు రూ.60వేల కోట్లు చెల్లిస్తున్నారని ఆరోపించారు. రాఫెల్ ఒప్పందం ఓ భారీ కుంభకోణం అని తేలిపోయిందని జైపాల్ విమర్శించారు. అబద్ధం చెప్పి మోడీ - నిర్మలా మోసం చేశారని.. వారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని తీవ్రంగా ఇరుకున పెట్టిన సంగతి తెలిసిందే.. రాఫెల్ ఒప్పందంలో రిలయన్స్ కంపెనీ తమకు తెలియదని.. ప్రధాని మోడీనే రిలయన్స్ పేరును సూచించారని హాలెండ్ సంచలన ప్రకటనను ఇప్పుడు కాంగ్రెస్ రెండు చేతులా అందిపుచ్చుకుంటోంది. రాహుల్ తోపాటు కాంగ్రెస్ సీనియర్లంతా రాఫెల్ విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టాలని నిర్ణయించింది. అందుకే కాంగ్రెస్ లీడర్లు ఇప్పుడు తమకు తెలిసిన లెక్కలతో సహా చెబుతూ టార్గెట్ చేస్తున్నారు. దీంతో బీజేపీ అడ్డంగా బుక్కవుతోంది.