తెలంగాణ కాంగ్రెస్ నేతల కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్ల లెక్కను చెప్పుకొచ్చారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కు 220 సీట్లు ఖాయమన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చస్తున్నారు. ఓపక్క కాంగ్రెస్ కు 100 సీట్లు దాటతాయా? అన్న సందేహాన్ని కొందరు వ్యక్తం చేస్తుంటే.. 150 కు మించి సీట్లు రావటం గొప్పగా అంచనా వేస్తున్నారు.
ఇలాంటివేళ.. మల్లురవి మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 220 సీట్లు సొంతం చేసుకునే మాటలు చెబుతున్న మల్లురవి లెక్కలోకి వెళితే.. తెలంగాణలో ఎక్కువ స్థానాల్ని సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఎక్కువ స్థానాలు అని చెప్పే మల్లురవి.. ఎన్ని స్థానాలన్న విషయాన్ని కచ్ఛితంగా చెబితే బాగుంటుంది. తెలంగాణలో ఒకట్రెండు స్థానాలు గెలిస్తేనే గొప్పగా అనుకుంటున్న వేళ.. ఎక్కవ సీట్లు గెలుస్తామన్న మల్లురవి అంచనాను చూస్తే.. 220 సీట్ల లెక్కలో పస ఏమిటో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.
అనవసరమైన భ్రమల్లోకి వెళ్లకుండా.. ప్రాక్టికల్ కు దగ్గరగా ఉండే అంచనాల్ని చెబితే మల్లురవి లాంటివాళ్ల సీనియార్టీకి గౌరవం దక్కుతుంది. అలా కాకుండా కాకి లెక్కలు చెప్పటం ఇప్పటికి ఓకే అయినా.. ఫలితాల తర్వాత అసలు పస తేలి.. ఇప్పుడున్న మర్యాద కూడా మిస్ అవుతుందన్న విషయాన్ని మల్లురవి లాంటి సీనియర్లు గుర్తిస్తే మంచిది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ గెలిచే సీట్లు సంగతి తర్వాత.. తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుస్తారో కాస్త లెక్క చెబుతారా?