ఐదేళ్ల ప్రతిపక్ష వాసం తర్వాత కూడా తమ పార్టీ తీరు ఏ మాత్రం మెరుగు పడకపోవడం గురించి కాంగ్రెస్ పార్టీ తల పట్టుకుంది! ఈ సారి స్వయంగా రాహుల్ గాంధీ ఎంపీగా ఓడిపోయారు. తమ ప్రధాన మంత్రి అభ్యర్థే ఎంపీగా ఓడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ.
ఐదేళ్ల తర్వాత కూడా పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదు - వచ్చే ఐదేళ్ల కథ ఎలా ఉంటుందో అనేది కాంగ్రెస్ వాళ్లకు టెన్షన్ గా మారింది. కనీసం కొన్ని రాష్ట్రాల్లో అయినా ఘన విజయాలు నమోదు చేయకపోతే వచ్చే ఎన్నికల మీద కూడా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కాంగ్రెస్ విషయంలో విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి.
ఇలాంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు బాబా రాందేవ్. కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఈయన రీజన్లను కూడా చెప్పేశారు. రాహుల్ గాంధీ యోగా చేయకపోవడమే కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా మరోసారి ఓడిపోవడానికి కారణమని రాందేవ్ తేల్చారు.
రాహుల్ యోగా చేయడం మొదలుపెడితే కాంగ్రెస్ కు భవిష్యత్ ఉండవచ్చని ఆయన అంటున్నారు. మోడీ యోగా చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే అని - గతంలో కాంగ్రెస్ కీలక నేతలు నెహ్రూ - ఇందిరాగాంధీలు కూడా యోగా చేసేవారని, అయితే రాహుల్ కు మాత్రం అలాంటి అలవాటు లేదని.. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత కూడా కోలుకోలేదని రాందేవ్ అంటున్నారు. అందుకే వీలైనంత త్వరగా రాహుల్ గాంధీ యోగా చేయడం మొదలుపెట్టాలని ఆయన ఉచిత సలహా ఇచ్చారు. మరి రాహుల్ ఈ సలహాను స్వీకరించి యోగాసనాల ప్రాక్టీస్ మొదలుపెడతారా?