ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. తెలంగాణ రాష్ట్ర సమితి - కాంగ్రెస్ పార్టీలు శాసన సభకు పోటీ చేసే అభ్యర్దుల ఎంపికలో తలమునకలవుతున్నాయి. ఇందుకోసం ప్రైవేటు ఏజన్సీలతో సర్వేలు చేయిస్తున్నాయి. ఎన్నికలకు ఏడాది గడువుండడంతో ఇప్పటినుంచే సమర్దులైన అభ్యర్దుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను - ఎంపీలను మారుస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కొత్తవారి కోసం అన్వేషణ ప్రారంభించారు. ఇందుకోసం సర్వేలే శరణ్యమని నిర్ణయించారు. ఇంతవరకూ పార్టీపరంగా చేసిన సర్వేల స్థానంలో ప్రైవేటు సంస్ధలు - వ్యక్తుల ద్వారా ఈ సర్వేలు చేయించాలని నిర్ణయించారు. పార్టీలో ఇంతవరకూ చేయించిన సర్వేలు బహిర్గతమవుతున్నాయని దీని వల్ల అభ్యర్దులు పైరవీలు చేసే అవకాశం ఉందని పార్టీ అధినాయకుడు కె. చంద్రశేఖర రావు భావిస్తున్నారు. సర్వే కోసం రెండు ప్రైవేటు సంస్థలతో కూడా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్దుల కోసం సర్వేలు నిర్వహించాలని భావిస్తోంది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరాకు ఈ సర్వేలు చేపట్టినట్టు సమాచారం. రానున్న ఎన్నికలలో కచ్చితంగా విజయం సాధించేవారినే బరిలోకి దించాలని నిర్ణయించారు. గత ఎన్నికలలో మూడు - నాలుగు వేల లోపు ఓట్ల తేడాతో పరాజయం పాలైన అభ్యర్దులకు తిరిగి టిక్కెట్లు ఇచ్చే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని ఎలాగైనా గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో అభ్యర్దుల ఎంపిక ఉండాలని భావిస్తున్నారు.
తెలుగుదేశంతో సహా కొన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనుకుంటోంది కాంగ్రెస్. ఈ పరిస్థితుల్లో ఏ ఏ నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలి అనే అంశాలను కూడా సర్వేలో తేల్చనున్నారు. ఎన్నికల ఫలితాలపై ఓటింగ్ కు ముందే సర్వే నిర్వహించి తెలుగు రాష్ట్రాలలో పేరు తెచ్చుకున్న మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సంస్థ చేత ఈ సర్వే చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లగడపాటి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడంతో ఈ సర్వే అత్యంత పగడ్బందీగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. ఇలా తెరాస - కాంగ్రెస్ పార్టీలు సర్వేల కార్యక్రమాన్ని చేపడుతున్నాయి.