బీజేపీ - ఎంఐఎం.. రెండు మతతత్వ పార్టీల కిందే లెక్క. హిందుత్వ ముసుగులో బీజేపీ.. ముస్లింల తరుఫున ఎంఐఎం రాజకీయం చేస్తుంటాయి. సిద్ధాంతపరంగా.. ఏ లెక్కన చూసినా ఈ రెండు బద్ధ శత్రువులైన పార్టీలు.. అందుకే ప్రతీసారి ఎంఐఎం - బీజేపీ నేతలు ఒకరికి వ్యతిరేకంగా ఒకరు దమ్మెత్తిపోసుకుంటారు. వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు పొడచూపాయి.
ఇన్నాళ్లు హైదరాబాద్ కే పరిమితమైన ఎంఐఎం దేశంలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు విస్తరించి పోటీచేస్తూ ఉనికి చాటుతోంది. ఈ రెండు పార్టీలు మతం ప్రాతిపదికనే ఓట్లు కొల్లగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు..
అయితే ఇన్నాళ్లు ఎంఐఎం-కాంగ్రెస్ దోస్తీ కట్టి లౌకిక వాదంతో ముందుకెళ్లాయి. కాంగ్రెస్ కుదేలు అయ్యి అధికారం కోల్పోవడంతో ఎంఐఎం దూరంగా జరిగింది. తాజాగా ఎంఐఎం పార్టీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీపడుతోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బలంగా అధికారంలో ఉన్న బీజేపీని కాదని.. ఎంఐఎం నేతలు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నాడు. తన శత్రువైన బీజేపీపై ఏ విమర్శలు చేయడం లేదు. కాంగ్రెస్ కు కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినా ఆ పార్టీ లేవలేదంటూ హాట్ కామెంట్ చేశారు. మహారాష్ట్ర - హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ అసలు పోటీనే కాదని సంచలన కామెంట్ చేశారు. ఇక ఎంఐఎం పార్టీ బెంగాల్ లోనూ పోటీకి రెడీ అయ్యిందని చెప్పుకొచ్చాడు.
అయితే ఎంఐఎం అసద్ ఆరోపణలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఎన్నికల్లో గెలవడం కోసం బీజేపీ-ఎంఐఎం కలిసి కుట్ర సిద్ధాంతం అమలు చేసి మతం ప్రాతిపదికన ఓట్లు దండుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీకి గెలుపు బాటలు వేస్తుంది ఎంఐఎం యేనేనని కాంగ్రెస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. గుజరాత్ లో మైనార్టీలున్నా ఎంఐఎం పోటీచేయడం లేదని.. యూపీ మహారాష్ట్ర లో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్లను దూరం చేసేందుకే ఎంఐఎం ఇక్కడ పోటీచేస్తోందని కాంగ్రెస్ అనుమానిస్తోంది. దీన్ని బట్టి తెరవెనుక బీజేపీ - ఎంఐఎం కలిసి నాటకాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.