అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో కాంగ్రెస్ నేతల రచ్చ చూస్తుంటే జనాలకు రోత పుడుతోంది. రెండు వరస ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ నేతలకు ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విషయం గురించి ఆలోచించకుండా తమలో తామే కొట్టేసుకుంటున్నారు. వీళ్ళ గొడవలు చూస్తుంటే జనాలకు చాలా చిరాకుగా ఉంది. కాంగ్రెస్ కు జనాలు ఓట్లేద్దామని అనుకున్నా నేతలే వేయనిచ్చేట్లుగా లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయటానికి మీరెవరు అని హస్తం పార్టీ నేతలు జనాలను నిలదీసేట్లున్నారు.
తమపార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న అక్కర తమకే లేకపోతే జనాలకు ఎందుకని నిలదీసేట్లుగానే ఉన్నారు నేతలు. లేకపోతే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ను అమ్మ నా బూతులు తిడుతున్నారు. తానేం తక్కువ తినలేదన్నట్లుగా రేవంత్ కూడా రాజగోపాల్ కు రిటర్న్ గిఫ్ట్ గా బూతులు తిట్టేస్తున్నారు. తన తమ్ముడిని రేవంత్ తిట్టడాన్ని సహించలేక అన్న వెంకటరెడ్డి జోక్యం చేసుకున్నారు.
రేవంత్ ను భువనగిరి ఎంపీ, రాజగోపాల్ అన్న తిట్టడాన్ని సహించలేక మాజీ ఎంఎల్ఏ రాంరెడ్డి దామోదర్ రెడ్డి సీన్లోకి ఎంటరైపోయారు. వీళ్ళు ఇలా తిట్టుకుంటుండగానే వరంగల్ కు చెందిన సీనియర్ నేత అద్దంకి దయాకర్ ఢిల్లీకి వెళ్ళిన వెంకటరెడ్డిని బహిరంగసభలోనే బూతులు తిట్టేశారు. ఇలా ఒకరిని మరొకళ్ళు తిట్టేసుకోవటం, ఎవరు ఎవరిని తిడుతున్నారు ? ఎవరు ఎవరిని ఎందుకు తిడుతున్నారో కూడా జనాలకు అర్ధంకావటం లేదు. తమకు ఓట్లేయాలని అనుకున్న జనాలను నేతలంతా కలిసి చావగొడతారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
జనాల సెంటిమెంటును గౌరవించి సోనియమ్మ ప్రత్యేక తెలంగాణా ఇచ్చిందని చెప్పుకుంటున్న నేతలు జనాలు మాత్రం తమకు అధికారాన్ని ఎందుకు అప్పగించటం లేదో అర్ధం చేసుకోవటం లేదు. తెలంగాణాను ఇచ్చింది తామే తెచ్చిందీ తామే అని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నా జనాలు ఎందుకని పట్టించుకోవటం లేదు ? ఎందుకంటే ఇలా కొట్టుకుంటుంటారు కాబట్టే. అధికారంలో ఉంటే పనులు, కాంట్రాక్టులు కోసం కొట్టేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉంటే పదవుల కోసం కొట్టుకుంటారు. మొత్తానికి కొట్టుకోవటం తమ జన్మహక్కుగా హస్తం నేతలు భావిస్తున్నారు. అందుకనే జనాలుకూడా ఇలాగే కొట్టుకుండుమనిని ప్రతిపక్షానికే పరిమితం చేస్తున్నారు.