ట్రంప్ టూర్ పై కాంగ్రెస్ సెటైర్..అదిరిందబ్బా!

Update: 2020-02-23 04:10 GMT
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కాలానికి తొలిసారిగా భారత్ వస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు అదిరేటి స్వాగతం పలికేందుకు ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రంప్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏకంగా లక్ష మందితో మానవ హారం లాంటి ప్రత్యేక కార్యక్రమానికి మోదీ సన్నాహాలు చేస్తున్నారు. మోదీ లక్ష మంది అంటే... ట్రంపేమో కోటి మంది అంటూ ఓ రేంజిలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనినంతా పరిశీలనగా చూస్తున్న హస్తం పార్టీ కాంగ్రెస్... ట్రంప్ రాక - మోదీ ఆహ్వానంపై అదిరిపోయే సెటైర్ వేసింది.

2014 - 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయింది. పార్టీ శ్రేణులు డీలాపడిపోతే... పార్టీ పగ్గాలు ఇక మోయలేనంటూ రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రాహుల్ వెంటే తామూ నడుస్తామని చెప్పి చాలా రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు కూడా పదవులను వీడి దాదాపుగా అజ్ఝాతవాసంలోకి వెళ్లిపోయినంత పనిచేశారు. ఇలాంటి సమయంలో అటు బీజేపీతో పాటు మోదీని ఆకాశానికెత్తేస్తున్న ట్రంప్ పై అదిరేటి సెటైర్ వేస్తూ కాంగ్రెస్ పార్టీ సంచలన పోస్టర్ ను ఆవిష్కరించింది. ఈ ట్వీట్ యాడ్ దేశ ప్రజలను అమితంగా ఆకట్టుకుంటుండగా... దీనిని చూసైనా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రాకపోతుందా? అన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

సరే... ట్రంప్ - మోదీలను ఓ ఆటాడేసుకున్న కాంగ్రెస్ పార్టీ యాడ్ లో ఏముందంటే... డొనాల్డ్ ట్రంప్ ‘నాగరిక్ అభినందన్ సమితి’ పేరిట  పబ్లిష్ చేసిన ఈ యాడ్ లో.. ‘ట్రంప్ ను చూసి హర్షాతిరేకంతో చేతులు ఊపితే.. మీకు 69 లక్షల ఉద్యోగాలు మీ కోసం రెడీగా ఉంటాయి.. ఇందుకు ‘రెమ్యునరేషన్’ ‘అచ్ఛే దిన్ ‘. డేట్ - టైం.. అంటూ..ట్రంప్ వచ్ఛే తేదీని - సమయాన్ని ప్రచురించింది. ట్రంప్ టూరే మొదలు కాకుండానే ఈ మేర సెటైర్ వేసిన కాంగ్రెస్... ఇక ట్రంప్ విజిట్ సందర్భంగా మరెన్ని గిమ్మిక్కులు చేస్తుందో చూడాలి.
 
Tags:    

Similar News