రైతులు - రాజవంశీకులు - రాజకీయ రంగంలోకి దిగిన వైద్యులు - ప్రభుత్వ మాజీ అధికారులు...ఇలా వివిధ వర్గాలు బరిలో ఉన్న బీజేపీ ఇలాకా అయిన మధ్యప్రదేశ్ లో బరిలో దిగేందుకు సన్నద్ధమవుతుంటే...వచ్చే ఐదేళ్లకు మధ్యప్రదేశ్ భవితవ్యాన్ని నిర్దేశించే ఎన్నికలు నేడు పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీలో 230 స్థానాలుండగా - వాటి కోసం 2,907 మంది పోటీ పడుతున్నారు. గత 15 ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి కొనసాగాలని భావిస్తుండగా, ఈసారి ఎట్లాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతున్నది. వివిధ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తోందని పలు సర్వేలు వెల్లడిస్తుండటం సంచలనంగా మారింది.
ఈ రాష్ట్ర ఎన్నికల్లో పలువురు ప్రముఖులు పోటీ గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి సేహోర్ జిల్లాలోని బుద్నీ స్థానం నుంచి పోటీకి దిగారు. ఆయన పై రైతుబిడ్డగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకుడు అరుణ్ యాదవ్ బరిలోకి దిగారు. కాంగ్రెస్ దిగ్గజాలు దిగ్విజయ్ సింగ్ - పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్ - ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మాత్రం ఎన్నికల పోరుకు దూరంగా ఉంటూ కేవలం ప్రచారానికే పరిమితమయ్యారు. దిగ్విజయ్ సింగ్ తోపాటు కొందరు సీనియర్ నేతల కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ అధిష్ఠానం ఈసారి టికెట్లు ఇచ్చింది. దిగ్విజయ్ సింగ్ కొడుకు జైవర్ధన్ రాఘోగఢ్ నుంచి పోటీ చేస్తుండగా - సోదరుడు లక్ష్మణ్ సింగ్ చంచోడా నుంచి బరిలో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ కుమారుడు - ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ మరోసారి చర్ట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీకి చెందిన సీనియర్ నాయకురాలు యశోధర రాజే సింధియా శివపురి స్థానం నుంచి - మాజీ ప్రధాని వాజపేయి మేనల్లుడు అనూప్ మిశ్రా గ్వాలియర్ జిల్లాలోని భితర్ వార్ నుంచి పోటీ చేస్తున్నారు. భింద్ జిల్లాలోని మెహగావ్ స్థానంలో అత్యధికంగా 34 మంది పోటీ చేస్తుండగా, పన్నా జిల్లాలోని గున్నోర్ సీటు కోసం కేవలం నలుగురే పోటీ పడుతున్నారు. అన్ని స్థానాలకు పోటీ చేస్తున్న బీజేపీ - కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. కాగా బీఎస్పీ కూడా 227 స్థానాలలో - సమాజ్ వాదీ పార్టీ 51 సీట్లలో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 208 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు - ఐఐటీ పూర్వ విద్యార్థి అలోక్ అగ్రవాల్ నైరుతి భోపాల్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్ లో అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఈసారి కూడా తన ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ అనుకూలత తప్ప వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2003 నుంచి బీజేపీ అధికారంలో ఉండగా - 2005 నుంచి చౌహాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో కూడా తమ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ - 2008 - 2013 ఎన్నికలతో ఈసారి పరిస్థితిని పోల్చి చూస్తే.. అప్పటికన్నా ఈసారి పేదలు ఎక్కువగా మా బహిరంగ సభలకు వస్తున్నారు అని చెప్పారు. నోట్ల రద్దు - జీఎస్టీ వంటి అంశాలుకు తమ విజయానికి ఆటంకాలు కాబోవని అన్నారు. దీర్ఘకాలంలో ఆ రెండు అంశాలు తమకు సానుకూలంగా పరిణమించగలవని చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఈ దేశానికి దేవుడిచ్చిన ఆశీర్వాదమని కొనియాడిన చౌహాన్ - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార ప్రమాణాలను దిగజార్చారని విమర్శించారు.
కాగా, ఇటీవలి రైతుల ఆందోళన - పెద్దనోట్ల రద్దు - జీఎస్టీల కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాలతో పాటు పలు సామాజిక సంఘర్షణలు చోటు చేసుకున్న తీరు బీజేపీకి అనుకూలత తక్కువనే అంశాన్ని తెరమీదకు తెస్తున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం - వ్యవసాయ సంక్షోభం - బీజేపీ ప్రభుత్వ నేతలపై అవినీతి ఆరోపణలు వంటి అంశాలను ఉపయోగించుకుని - విభేదాల్ని తాత్కాలికంగానైనా పక్కన పెట్టి గట్టి అభ్యర్ధులను పోటీకి దింపితే–ముఖ్యంగా భోపాల్ - ఇండోర్ - గ్వాలియర్ - జబల్ పూర్ - ఉజ్జయిన్ నగరాల్లో– ఫలితాలను తిరగరాసే అవకాశాలు కాంగ్రెస్ కు ఉన్నాయని సర్వే నివేదిక తెలిపింది.
మధ్యప్రదేశ్ గణాంకాలు ఇవి
మొత్తం సీట్లు : 230
అభ్యర్థులు: 2,907
గత ఎన్నికల్లో పార్టీల బలాబలాలు :
బీజేపీ: 165 - కాంగ్రెస్: 58 -
బీఎస్పీ: 4 - ఇండిపెండెంట్లు: 3
మొత్తం ఓటర్లు :5,04,95,251
స్త్రీలు: 2,63,01,300
పురుషులు: 2,41,30,390,
థర్డ్ జెండర్ : 1,389