నేను ఓడినా నా పోరాటం ఆగదు

Update: 2019-03-13 15:23 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయంగా కాస్త గ్యాప్ తీసుకున్న రేవంత్ రెడ్డి మరోసారి తెరపైకి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందని, ఇలాంటి టైమ్ లో ఓ నాయకుడిగా తను మరోసారి పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుందని అంటున్నారు రేవంత్.

ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఓ ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా గెలుస్తానని ప్రకటించారు. ఈ మేరకు పార్టీలో ఆయన తెరవెనక చేయాల్సిందంతా చేశారు. ఆయన కోరుకునే సీటు కూడా కన్ ఫర్మ్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాత్రం ఓ కార్యకర్తలా పనిచేస్తానని, అధిష్టానం ఎక్కడ్నుంచి పోటీ చేయమంటే అక్కడ్నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు.

ప్రస్తుతం పార్టీ కష్టకాలంలో ఉందని, ఇలాంటి టైమ్ లో ఓ నాయకుడిలా అధిష్టానం చెప్పినట్టు నడుచుకోక తప్పదంటూ ప్రసంగాలు అదరగొట్టారు రేవంత్. కానీ ఆయన సీటు ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మీడియా ముందుకొచ్చి మైక్ పట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అటు ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా రేవంత్ స్పందించారు. ఒక ఎమ్మెల్సీ గెలిచే సత్తా కాంగ్రెస్ కు ఉన్నప్పటికీ, కచ్చితంగా ఎమ్మెల్సీ తమకే వస్తుందని తెలిసి, కేసీఆర్ ఎందుకు మరో అభ్యర్థిని పోటీలో నిలబెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్. సంప్రదాయాల పేరిట కేసీఆర్, కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందన్నారు.

Tags:    

Similar News