కరోనా బాధితురాలి ‌పై కాంట్రాక్ట్ ఉద్యోగి అఘాయిత్యం..!

Update: 2020-09-13 17:30 GMT
రోజురోజుకి కామాంధులు స్వైరవిహారం చేస్తున్నారు. చివరకు కరోనా పేషెంట్ అనే సంగతి కూడా మరచిపోయి. ఆమె ఆస్పత్రి లో చికిత్స పొందుతోన్న విషయం కూడా పట్టకుండా కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.

కరోనాబారిన పడిన నాంపల్లికి చెందిన ఓ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, అదే ఆస్పత్రిలో కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా ఉన్న ఓ వ్యక్తి అత్యాచారయత్నం చేశారు. అర్ధరాత్రి వేళ యువతి ఉన్న గదిలోకి వెళ్లిన కామాంధుడు. జండూబామ్ ‌తో మర్దన చేస్తానంటూ లైంగికదాడికి యత్నించాడు. అర్ధరాత్రి సమయంలో.. కాపాడండి అంటూ ఆసుపత్రిలో యువతి కేకలు వేసింది. కామాంధుడి బారి నుంచి తప్పించుకుని, పరుగులు తీసి అధికారులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తిపై గతంలోనూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక, ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో కరోనా చికిత్స చేయించుకోడానికి యువతులు, మహిళలు వణికిపోతున్నారు.
Tags:    

Similar News