వివాదం: జయశంకర్ స్మృతివనంలో కేసీఆర్, కేటీఆర్ బొమ్మలు

Update: 2021-03-02 16:30 GMT
తెలంగాణ ఉద్యమ సిద్ధాంత కర్త జయశంకర్ అంటే కేసీఆర్ కే కాదు.. తెలంగాణ సమాజానికి కూడా ఎంతో అభిమానం. జయశంకర్ చనిపోయేంత వరకు కూడా తెలంగాణ కోసం శ్వాసించాడు.. కేసీఆర్ వెన్నంటి ఉన్నాడు. అందుకే అందరూ ముద్దుగా ‘సార్’ అంటూ జయశంకర్ ను గుర్తు చేసుకుంటారు.

ఈ క్రమంలోనే వరంగల్ నగర సుందరీకరణ పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి పబ్లిక్ పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నారు.  హన్మకొండలోని ఏకశిల పార్కును సుందరీకరిస్తున్నారు.

జయశంకర్ మరణం తర్వాత ఏకశిల పార్కుకు ఆయన పేరు పెట్టారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కును హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తూ నిర్మిస్తున్నారు.

పార్కులో  భారీ సిమెంట్ గోడ నిర్మించి దానిపై శిల్పాలను చెక్కుతున్నారు. జయశంకర్ ఉద్యమ జీవిత విశేషాల పేరుతో చెక్కిన శిల్పాల్లో ఆయన కంటే కేసీఆర్, కేటీఆర్ ల చిత్రాలకే ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేటీఆర్ తో కలిసి జైతెలంగాణ నినాదం ఇచ్చిన చిత్రాన్ని కూడా చెక్కడం వివాదాస్పదమైంది.ఎంతో మంది ఉద్యమకారులున్నా కేసీఆర్, కేటీఆర్ లనే పెట్టడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

అధికారులు మాత్రం జయశంకర్ జీవిత విశేషాలనే చెక్కుతున్నామని.. కేసీఆర్ తో కలిసిన క్షణాలు, కేసీఆర్ ఆమరణ దీక్ష చిత్రాలు వేశామని చెబుతున్నారు.
Tags:    

Similar News