జగన్ బలం అక్కడేనా...అందుకే గట్టిగా టార్గెట్ !
ఇక్కడ వైసీపీకి బలం ఉంది. 2024 ఎన్నికల్లో అయితే వైసీపీ ఓటమి పాలు కావచ్చు కానీ ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటే రాయలసీమలో స్వీప్ చేయడం కష్టం కాదని కూడా అంటున్నారు.
వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బలం ఎక్కడ సాలిడ్ గా ఉంది అంటే రాజకీయం తెలిసిన వారు చెప్పేయవచ్చు. ఆయనకు రాయలసీమ నాలుగు జిల్లాలలో బలం ఉంది. అక్కడ ఉన్న ఉమ్మడి చిత్తూరు, కర్నూల్, అనంతపురం కడపలలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అంటే ఏపీలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు అయితే అందులో సగానికంటే ఎక్కువగానే ఒక రీజియన్ లో ఉన్నాయి.
ఇక్కడ వైసీపీకి బలం ఉంది. 2024 ఎన్నికల్లో అయితే వైసీపీ ఓటమి పాలు కావచ్చు కానీ ఆ పార్టీ మళ్లీ పుంజుకుంటే రాయలసీమలో స్వీప్ చేయడం కష్టం కాదని కూడా అంటున్నారు. ఇక అక్కడ పట్టు సాధించి నెల్లూరు ఒంగోలులో గణనీయమైన సీట్లు తెచ్చుకుంటే మిగిలిన కోస్తా జిల్లాలలో ఏ మాత్రం అనుకూలత పెరిగిన మరోసారి జగన్ సీఎం అన్నది వైసీపీ మాట నెరవేరుతుందని అంటున్నారు.
అందుకే వైసీపీకి ఎక్కడ కొట్టాలీ అంటే రాయలసీమలోనే అని అంటున్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అయితే చాణక్య వ్యూహాలనే అమలు చేస్తున్నారు అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడినా నలభై శాతానికి తక్కువ కాకుండా ఓటు షేర్ ఒంటరిగా దక్కించుకున్న విషయాని బాబు లాంటి అనుభవజ్ఞుడు ఎలా మరచిపోగలుగుతారు. అందుకే ఆయన ఇప్పటి నుంచే 2029 ఎన్నికల కోసం పక్కాగా ప్లాన్ చేస్తున్నారు
ఇక జనసేన బీజేపీలతో కలసి 2029 ఎన్నికలను ఎదుర్కోవాలని బాబు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఆరు నూరు అయినా ఈ పొత్తు కొనసాగే అవకాశాలే ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగితేనే తప్ప ఈ పొత్తు వీడేది కాదు. మరో వైపు చూస్తే రాయలసీమలో గతం లో కంటే ఈసారి అత్యధిక సీట్లను కూటమి గెలుచుకుంది. అంతే కాదు వైసీపీని దాదాపుగా జీరో చేసి పారేసింది.
దానికి కారణం సీమలో జనసేన ప్రభావం ఉందని నమ్ముతున్నారు. యువత ఎక్కువగా పవన్ పట్ల అట్రాక్ట్ అవుతారు. అలాగే బలమైన సామాజిక వర్గం కూడా ఆ పార్టీకి దన్నుగా ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లోనూ ఇదే రకమైన థియరీ ని అమలు చేయాలని బాబు యోచిస్తున్నారు అని అంటున్నారు.
అందుకే తరచూ రాయలసీమ పర్యటనలు పవన్ చేస్తున్నరు అని ఆయనను ఆ దిశగా బాబు ప్రయోగిస్తున్నారు అని అంటున్నారు. ఆ మధ్యన పవన్ కడప వెళ్ళి మరీ ఒక ఎంపీడీవో మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు. తాను అండగా ఉంటాను అన్నారు. వైసీపీ నేతలను హెచ్చరించారు. దాని కంటే ముందు టీచర్స్ పేరేంట్స్ మీటింగ్ కి కడపనే పవన్ ఎంచూన్నారు.
ఇపుడు చూస్తే లేటెస్ట్ గా పవన్ కర్నూల్ జిల్లా వెళ్లారు. గ్రీన్ కో ప్రాజెక్ట్ పనులను ఆయన పరిశీలించరు. ఒక డే లాంగ్ ప్రోగ్రాం గా ఇది సాగింది. ఇలా తరచూ పవన్ వెళ్ళడమే కాదు అవసరమైతే కడపలో క్యాంప్ ఆఫీసుని ఏర్పాటు చేస్తాను అని కూడా అంటున్నారు.
ఇదంతా ఎందుకు అంటే వైసీపీని రాజకీయంగా నిలువరించడానికే అంటున్నారు. రాయలసీమలో టీడీపీ బలానికి తోడు జనసేన కూడా తోడు అయితే ఇక మరోసారి సీమలో ఎదురు ఉండదన్న భారీ వ్యూహంతోనే ఇవన్నీ అమలు చేస్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు వైసీపీని దెబ్బ తీయాలంటే అక్కడ పవన్ అస్త్రం వాడాల్సిందే అని డిసైడ్ అయింది అంటున్నారు.
ఇక గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర క్రిష్ణా గుంటూరులలో ఎటూ కూటమికి రాజకీయ ఆధిపత్యం ఉందని భావిస్తోంది. అందువల్ల వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా ఉన్న రాయలసీమలోనే బలోపేతం కాకుండా అడ్డుకుంటే ఆ ప్రభావం మిగిలిన ప్రాంతాల మీద పడకుండా ఉంటుందని ముందస్తు వ్యూహాలను అమలు చేస్తోంది అంటున్నారు.