ఏపీలో కరోనా మహమ్మారి విజృంభన చేస్తోంది. రోజురోజుకి కరోనా వైరస్ కేసులతో పాటు, మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. ఇక తాజాగా శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ లో గడిచిన 24 గంటల్లో 55,010 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,544 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,34,940కు చేరింది. కరోనా వైరస్ మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 91 మంది కరోనా మహమ్మారి వల్ల మృతి చెందారు. దీనితో ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,092కు పెరిగింది.
గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 8,827 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,44,045కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 87,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 55,010 కరోనా పరీక్షలు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 3,1,29,857కు చేరింది. జిల్లాల వారీగా చూసుకుంటే తూర్పు గోదావరి జిల్లాలో 1312, పశ్చిమ గోదావరి 1131, చిత్తూరులో 1103, కర్నూలు 919, ప్రకాశం 797, విశాఖపట్నం 738, అనంతపురం 704, శ్రీకాకుళం 571, విజయనగరం 542, గుంటూరు 358, కడప 343, కృష్ణా జిల్లాలో 265 కొత్త కేసులు వెలుగు చూశాయి. గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 16 మంది, పశ్చిమ గోదావరిలో 13 మంది, నెల్లూరులో 12 మంది, తూర్పు గోదావరిలో 11 మంది, అనంతపురంలో 8 మంది, కడపలో ఏడుగురు, విశాఖపట్నంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ముగ్గురు మృత్యువాత పడ్డారు.