కోరనాకు పుట్టినిల్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభించింది. గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందుతూ... లక్షలాది మందికి సోకుతోంది. ఆగ్నేయంలోని షాంఘై నుంచి ఉత్తర ప్రావిన్సుల వరకు దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ సహా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయితే తాజాగా డ్రాగన్ కంట్రీలోని మరో మహా నగరంలో లాక్ డౌన్ విధించారు.
చాలా రోజుల తర్వాత చైనాలో ఆదివారం బారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంట్లోలనే 27 వేల 509 కేసులు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ కేవలం 914 మందిలో కొవిడ్ లక్షణాలు ఉన్నాయి. అయితే చైనాలో గ్వాంగ్జౌలో అత్యంత రద్దీ గల ఎయిర్ పోర్టుతో పాటు ఆ ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా పేరొందింది.
అయితే ఇక్కడ కరోనా కేసులు నమోదు కావడంతో ఆంక్షలను విధించారు. ఇక్కడ తాజాగా 27 కేసులు నమోదు అయ్యాయి. కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ... ఆ ప్రాంతంలో ఉన్న జనాభా రద్దీ దృష్ట్యా భారీ ఆంక్షలను ఎదుర్కుంటోంది.
గ్వాంగ్జౌలో జనాభా కోటి 80 లక్షలు. ఇప్పటికే దక్షిణ గ్వాగ్జౌలో పాఠశాలకు సెలవులు ప్రకటించారు. ఆన్ లైన్ లోనే పాఠాలు చెప్తున్నారు. ఈ ఆంక్షలు నగరంలో ఒక వారం పాటు కొనసాగుతాయి. అలాగే అత్యవసరం అయితే తప్ప స్థానికులు నగరాన్ని విడిచి వెళ్లకూడదని.. ఒక వేళ వెళ్లాల్సి వస్తే.. గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాలని తెలిపారు. అందులోనూ కరోనా లేనట్టు అంటే... నెగటివ్ అని వచ్చినట్లు సర్టిఫికేట్ చూపించాలని మున్సిపల్ అధికారులు తెలిపారు.
అంతే కాకుండా నగర వ్యాప్తంగా కొవిడ్ పరీక్షల సంఖ్యను పెంచారు. అలాగే నగరంలో ఉన్న ఎగ్జిబిషన్ కేంద్రాలను తాత్కాలిక ఆసుపత్రులుగా మారస్తున్నారు. మరో వైపు ప్రముఖ పట్టణం షాంఘై కూడా లాక్ డౌన్ లోనే ఉంది. షాంఘై ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను గత నెల మార్చి 12 నుంచి మూసేసి.. ఆన్ లైన్ పాఠాలను మాత్రమే చెప్తున్నారు. కరోనా కారణంగా ఉత్తర ప్రావిన్స్ జిలిన్, షాంఘై సమీపంలో జియాంగ్సు ప్రావిన్సులో ఫ్యాక్టరీలను మూసి వేశారు.
షాంఘైలోని 2.5 కోట్ల మందికి నిత్యావసరాలు సరఫరా చేయటం అధికారులకు సవాలుగా మారింది. కనీసం తిండి కూడా దొరకడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న షాంఘై పౌరులు.. భవనాల కిటికీలు, బాల్కనీల్లోకి వచ్చి పెద్దగా అరుస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకూడదని డ్రాగన్ పాటిస్తున్న జీరో-కొవిడ్ విధానం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇంకెన్ని రోజులు ఈ లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడాలోనని ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.