టీడీపీలో కరోనా కలకలం.. చంద్రబాబుకు టెన్షన్ !

Update: 2021-04-10 11:30 GMT
ప్రస్తుతం దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా  నమోదు అవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 2,765 కరోనా కేసులు వచ్చాయి. చిత్తూరులో 496, నెల్లూరులో 296 కేసులు వచ్చాయి. 24 గంటల వ్యవధిలో ఈ రెండు జిల్లాల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. ఏపీలో గడచిన 24 గంటల్లో 11 మంది మరణించారు.  అందులో నలుగురు చిత్తూరు, నెల్లూరు జిల్లాల వాసులే.

 ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీడీపీ తిరుపతి బై పోల్ లో ఎంపీ సీటు ఎలాగైనా గెలవాలని విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహిస్తుంది. వారం రోజులుగా ప్రచారాన్ని ముమ్మరం చేసింది.. అధినేత చంద్రబాబుతో పాటూ పార్టీ ముఖ్య నేతలందరూ అక్కడే ఉన్నారు. డోర్ టూ డోర్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నారు.  అయితే ,  టీడీపీ ప్రచారంలో కరోనా కలకలం సృష్టించిందట. టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ ‌గా నిర్థారణ అయ్యింది అని ప్రసారమాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.  ఎమ్మెల్యే  గొట్టిపాటి రవి, మాజీ మంత్రి జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ కావడంతో  టీడీపీ నేతలు ప్రచారం నుండి నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోతున్నారని సోషల్ మీడియా లో ఓ వార్త వైరల్ అవుతుంది.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే .. టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి అనిత, సంధ్యారాణి తిరుమల దర్శనానికి వెళ్లిన ఆ మరుసటి రోజునే అనిత, సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్ ‌గా తేలిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కరోనా భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆందోళన చెందుతున్నారు. అనిత, సంధ్యారాణిలకి కరోనా నిర్దారణ కావడం తో టీడీపీ అధినేత చంద్రబాబును కరోనా టెన్షన్ వెంటాడుతోంది. పాజిటివ్ తేలిన నేతలతో కాంటాక్ట్ ఉన్నవారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
Tags:    

Similar News