ఛత్తీస్ ఘడ్ లోని ఓ మహిళా డీఎస్పీ ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నారు. ఆమె చేస్తున్న పనికి అందరూ సలాం కొడుతున్నారు. మీరే రియల్ హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆమె పై ఎందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు అంటే .. భగభగ మండే ఎండలో కరోనా వారియర్ డ్యూటీ నిర్వర్తిస్తున్నారు. ఇదేం పెద్ద గొప్పనా అని అనుకోవచ్చు, కానీ ఆమె మాములు మనిషి కాదు. నిండు గర్భిణీ. అయినా, కూడా తన విధి కర్తవ్యంలో భాగంగా చేతిలో లాఠీ పట్టుకున్ని ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ, కరోనా రూల్స్ పాటించాలంటూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఆమె విధులు నిర్వహించే సమయంలో ఎవరో ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. మండే ఎండలో నిండు గర్భంతో విధులు నిర్వర్తిస్తున్న ఆమే. డీఎస్పీ శిల్పా సాహు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్ లోని దంతేవాడ డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు వహించాలని డీఎస్పీ కోరుతున్నారు. కరోనా మహమ్మారిని అడ్డుకునే జాగ్రత్తలను, మార్గదర్శకాలను విధిగా పాటించేలా చూసేందుకు మండుటెండల్లో సైతం ఆమె డ్యూటీ చేస్తున్నారు.
స్వయంగా ట్రాఫిక్ నియంత్రిస్తున్న శిల్పా సాహు ఫొటోను ట్విటర్ లో షేర్ చేస్తూ అడిషినల్ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ దీపాన్షు కబ్రా ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేశారు. దంతెవాడ డీఎస్పీ శిల్పాసాహు ఫొటో ఇది. గర్బిణిగా ఉన్నా విధుల్లో తన టీంతో బిజీగా ఉంది. అంతేకాదు కోవిడ్ నిబంధనలు పాటించాలని, లాక్ డౌన్ ను ఉల్లంఘించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది అంటూ రాసుకొచ్చారు. అంతేకాదు.. మహమ్మారి నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. నెటిజన్లు.. శిల్పాసాహు కమిట్ మెంట్ ను ప్రశంసించారు. విధుల పట్ల ఆమె అంకితభావాన్ని అభినందించారు. కరోనా మహమ్మారి వణికిస్తున్న ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడటమే ముఖ్యమని ఆలోచించిన ఆమె రియల్లీ గ్రేట్ పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా, ఇలాంటి మహమ్మారి సమయంలో గర్భిణి అయిన శిల్పా.. ఇంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదని మరికొందరు చెప్పారు. ఇది తప్పు, ఆమె అలా చేయకూడదు అని అన్నారు. ఆమెకు సెలవు ఇవ్వచ్చు కదా అంటూ మరికొందరు ట్వీట్ చేశారు. కరోనా వైరస్ మన దేశంలో ప్రబలడం మొదలైన నాటి నుంచి కరోనా వారియర్స్ చేస్తున్న సేవలు వెలకట్టలేనివి అని చెప్పవచ్చు.