గ్యాంగ్ స్టర్ల అప్పగింత డిమాండ్.. అమెరికా డిపోర్టేషన్ కు కౌంటరా?

సరైన పత్రాలు లేని కారణంగా డిపోర్టేషన్ పేరిట అక్రమ వలసదారులను తరిమేస్తుండగా.. పార్ట్ టైమ్ జాబ్ లు చేసేవారు లేక భారతీయుల వ్యాపారాలకు కష్టాలు వచ్చి పడ్డాయి.

Update: 2025-02-12 15:30 GMT

అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక అమెరికాలో సక్రమంగా ఉంటున్న భారతీయులకు, అక్రమంగా వెళ్లిన భారతీయులకు కష్టాలు తప్పలేదు. సరైన పత్రాలు లేని కారణంగా డిపోర్టేషన్ పేరిట అక్రమ వలసదారులను తరిమేస్తుండగా.. పార్ట్ టైమ్ జాబ్ లు చేసేవారు లేక భారతీయుల వ్యాపారాలకు కష్టాలు వచ్చి పడ్డాయి.

అక్రమ వలసలు ఎక్కడైనా ఏ దేశానికైనా సమస్యే. అయితే, ఉన్నపళంగా పంపించేస్తుడమే ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ సైతం అమెరికా చర్యలను ఏమీ అనలేకపోతోంది. అయితే, మీ డిపోర్టేషన్ సరే.. మా దేశంలో మోస్ట్ వాంటెండ్ గా ఉంటూ మీ దేశంలో నక్కిన గ్యాంగ్ స్టర్ల జాబితా ఇదిగో..? వీరిని అప్పగించండి అని కోరుతోంది. ఈ మేరకు జాబితా సిద్ధం చేసింది.

సరిగ్గా ప్రధాని మోదీ అమెరికాలో కాలు మోపుతున్న వేళ గ్యాంగ్ స్టర్ల జాబితాను ఆ దేశానికి అందిస్తుండడం గమనార్హం. భారత్ భద్రతా ఏజెన్సీలు పలువురు గ్యాంగ్‌ స్టర్ల పేర్లతో నివేదిక రూపొందించి అమెరికాకు ఇవ్వనున్నారు. వీరంతా అమెరికాలో నక్కి.. భారత్‌ లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో వెనక్కి రప్పించే ప్రయత్నం ఇది.

వాస్తవానికి విదేశాల్లో ఉంటున్న నేరగాళ్ల జాబితా కేంద్ర సంస్థల వద్ద ఉంది. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని వారాల క్రితం ప్రత్యేకించి అమెరికాలో ఉంటున్నవారి జాబితాను సిద్ధం చేయాలని కేంద్ర హోం శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.

పంజాబీ ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా,

మహారాష్ట్ర మాజీ మంత్రి బాబాసిద్ధిఖీ హత్యతో పాటు, బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు వంటి డజనుకు పైగా కీలక కేసుల్లో నిందితుడైన అన్మోల్‌ బిష్ణోయ్‌ అమెరికాలోనే దాగాడు. ముంబై పోలీసులు అతడి కదలికల వివరాలను అమెరికా అధికారులతో పంచుకున్నారు. బిష్ణోయ్ ను రప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో అత్యంత కీలకం గోల్డీ బ్రార్‌. ఇతడి అసలు పేరు సతీందర్‌ సింగ్‌. సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు, మూసేవాలా హత్యతో గోల్డీ బ్రార్ పేరు బాగా వినిపించింది. ఇతడూ అమెరికాలో ఉన్నాడు.

ఇలాంటి పలువురి మోస్ట్ వాంటెడ్ ల జాబితాను భారత ప్రభుత్వం అమెరికాకు సమర్పించింది. డిపోర్టేషన్ క్రమంలో ఇది సరైన చర్యగానే కనిపిస్తోంది.

Tags:    

Similar News