కరోనా ఎఫెక్ట్: 4 గంటలే బ్యాంక్ సేవలు

Update: 2020-03-24 13:00 GMT
కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తుండడం తో అన్ని రంగాలపై ప్రభావం పడుతోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు మూతపడ్డాయి. మార్కెట్లు, దుకాణాలు బంద్ అయిపోయాయి. అయితే అత్యవసరమైన నిత్యావసరంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రం నడుస్తోంది.

అయితే తాజాగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పనిగంటల్ని తగ్గించాయి. ఇకపై బ్యాంకులు కేవలం 4 గంటలే పనిచేస్తాయని ప్రకటించారు. ఈమేరకు ఆర్బీఐ సహా పలు బ్యాంకులు తమ సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా పనిగంటలను తగ్గించాయి.

ప్రస్తుతం బ్యాంకులు సాధారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి.కానీ ఇక నుంచి రోజుకు నాలుగు గంటలే అందుబాటులో ఉంటాయి.

ఈనెల 31 వరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పనిచేస్తాయని ఆర్బీఐ తెలిపింది. వినియోగదారులు సహకరించాలని కోరాయి. ఆన్ లైన్ లావాదేవీలు వాడుకోవాలని.. బ్యాంకు రావద్దని కోరుతున్నాయి.
Tags:    

Similar News