కరోనా ఎఫెక్ట్ దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కుదేలు చేసింది. కరోనా కారణంగా దేశంలో మోడీ సర్కార్ లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో సర్వం బంద్ అయిపోయింది. అందరూ ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అందరి ఆదాయాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
కరోనాతో దేశంలో లాక్ డౌన్ విధించడంతో ఈ సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికం లో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయింది. దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఏకంగా గత ఏడాదితో పోలిస్తే 42శాతం తగ్గాయి.
రియల్ ఎస్టేట్ రంగం పీక్స్ లో ఉండే హైదరాబాద్ లో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగా 50శాతం పడిపోయాయి.
దేశంలోనే అత్యధిక అమ్మకాలు పడిపోయిన నగరంగా హైదరాబాద్ నిలవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు బ్రోకరేజీ సంస్థ ‘అనరాక్’ తాజా నివేదికలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 24శాతం తగ్గాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 50శాతం, బెంగళూరు లో 45శాతం.. తర్వాత ఫుణె - ముంబైలో 42శాతం అమ్మకాలు పడిపోయాయి. చెన్నైలో కేవలం 36శాతమే పడిపోయాయి.