కోవిడ్19 అలియాస్ కరోనా....ఈ పేరు చెబితే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. వ్యాపార, పారిశ్రామిక, క్రీడా, వాణిజ్య, షేర్ మార్కెట్, పౌల్ట్రీ...ఇలా ఒకటేమిటి....దాదాపుగా అన్ని రంగాలపైనా కరోనా తన పంజా విసురుతోంది. కరోనా ధాటికి క్రీడారంగా తాజాగా కుదేలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న ఐపీఎల్ ...కరోనా దెబ్బకు వాయిదాపడింది. మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఈ మెగా టోర్నీ... ఏప్రిల్ 15వరకు వాయిదాపడింది. అప్పటికీ పరిస్థితుల్లో మార్పులు రాకపోతే....టోర్నీ రద్దు చేసే యోచనలో బీసీసీఐ ఉంది. ఇక తాజాగా కరోనా ఎఫెక్ట్ తో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ రద్దయింది.
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య తొలి వన్డే వర్షార్పణం అయింది. దీంతో, రెండో వన్డే వేదికైన లక్నోలోనే మూడో వన్డేను జరపాలని బీసీసీఐ భావించింది. కరోనా దెబ్బకు ప్రేక్షకులెవరూ లేకుండానే ఖాళీ స్టేడియంలో మ్యాచ్ నిర్వహించనున్న నేపథ్యంలో కోల్ కతాలో జరగాల్సిన మూడో వన్డే లక్నోకు షిఫ్ట్ అయింది. ఇక, కరోనా తీవ్రత పెరుగుతుండడంతో బీసీసీఐ రెండో, మూడో వన్డేలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ల మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా రద్దయింది. కరోనా దెబ్బకు దక్షిణాఫ్రికా టూర్ ను ఆసీస్ మహిళా క్రికెట్ జట్టు రద్దు చేసుకుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్ల మధ్య ఆస్ట్రేలియా లో జరుగుతున్న వన్డే మ్యాచ్ లకు ప్రేక్షకులెవరినీ అనుమతించడం లేదన్న సంగతి తెలిసిందే.