ఆ రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలకు కరోనా.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం !
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకి మరింతగా పుంజుకుంటుంది. సామాన్యులతో పాటుగా రాజకీయ నేతలు, మంత్రులు , ఎమ్మెల్యేలు అంతా కరోనా బారిన పడుతున్నారు. పంజాబ్ అసెంబ్లీలో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. పంజాబ్ అసెంబ్లీ కు కరోనా సెగ గట్టిగానే తాకింది. 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వీరిలో కొందరు మంత్రులు కూడా ఉన్నారు ఆగస్టు 28 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో మొత్తం 117 మంది ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించగా ..వారిలో 23 మందికి పాజిటివ్ వచ్చింది అని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందు ఇలాంటి పరిస్థితి ఏర్పడటం పై సీఎం విచారం వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే మంత్రులు,ఎమ్మెల్యేలకు కరోనా నెగటివ్ సర్టిఫికెట్‌ను స్పీకర్ కేపీ సింగ్ తప్పనిసరిచేశారు. ఇప్పటివరకూ పంజాబ్ రాష్ట్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి రాజేందర్ బజ్వా, జైళ్లు సహకార శాఖ మంత్రి సుఖ్ జిందర్ సింగ్ రాంద్వా, రెవిన్యూ మంత్రి గుర్ ప్రీత్ కంగర్, పరిశ్రమల శాఖ మంత్రి శ్యామ్ సుందర్ అరోరా, విధాన సభ స్పీకర్ అజైెబ్ సింగ్ భాటీలతో పాటు ఇతర ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకింది. ఇప్పుడిక మొత్తం అందరికీ కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించి..నెగెటివ్ వచ్చినవారినే సమావేశాలకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేశారు.
ఇకపోతే, బుధవారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేత్రుత్వంలో నీట్, జేఈఈలపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అమరీందర్ సింగ్ ఈ వివరాలు వెల్లడించారు. ఎమ్మెల్యేలు,మంత్రులే కరోనా బారినపడుతున్నారంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని, ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం సరికాదన్నారు. పరీక్షలు రద్దు చేసి దానికి ప్రత్యామ్న్యాయం చూడాలి అని కోరుతున్నారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లి పరీక్షలను వాయిదా వేయాల్సిందిగా కోరాలని తెలిపారు. సోనియా గాంధీ నేత్రుత్వంలో జరిగిన సమావేశంలో మొత్తం ఏడుగురు ముఖ్యమంత్రులు సుప్రీంలో రివ్యూ పిటిషన్‌కు ఏకాభిప్రాయానికి వచ్చారు. సమాఖ్య స్పూర్తికి విఘాతం కలిగించేలా వ్యవహరించేలా కేంద్రంపై పోరాడాల్సిందేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా.. విద్యార్థులు మానసిక వేదనకు గురవుతున్న ఈ తరుణంలో వారికి అండగా నిలబడుదామని అన్నారు. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నీట్, జేఈఈ పరీక్షలకి .. అడ్మిట్ కార్డ్స్ ను కూడా విడుదల చేసింది.