అసెంబ్లీ సమావేశాల వేళ కలకలం చోటుచేసుకుంది. ఒకరు కాదు.. రెండు కాదు ఏకంగా 66 మందికి కరోనా సోకడం కలకలం రేపింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ సందర్భంగా ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా ఈ సంచలనం వెలుగుచూసింది.
రేపటి నుంచి మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బంది, హౌస్ మార్షల్ లకు కరోనా పరీక్షలను నిర్వహించారు. అందులో ఏకంగా 66 మందికి కరోనా వైరస్ బయటపడడం కలకలం రేపింది.
కరోనా బయటపడ్డ వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలు, అధికారులు, సిబ్బందితోపాటు ప్రోటెం స్పీకర్ రామేశ్వర్ శర్మ కు కరోనా సోకినట్టు వెల్లడైంది.
ఇంకా చాలా రిపోర్టులు రాలేదని.. మరింత మందికి కరోనా సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో ఈ కరోనా కల్లోలంలో మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలను వాయిదా వేసినట్టు అసెంబ్లీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ఏపీ సింగ్ తెలిపారు. ఈ మూడు రోజులను బడ్జెట్ సెషన్స్ కు కలిపి తర్వాత నిర్వహిద్దామని అసెంబ్లీ వర్గాలు యోచిస్తున్నాయి.