దేశవ్యాప్తంగా కరోనా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏడాది నుంచి వైరస్ తన విశ్వ రూపం చూపిస్తోంది. మార్చి నుంచి మరోసారి కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. తగ్గినట్లే తగ్గిన పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా రెట్టింపు అయింది. ఇక చాలా రాష్ట్రాల్లో కొవిడ్ ఆంక్షలు అమలుచేస్తున్నారు.
వైరస్ బాధితుడి ప్రత్యక్ష తాకిడీ, దగ్గినా, తుమ్మినా పక్కన వ్యక్తికి వ్యాపిస్తుందని నిపుణులు సూచించారు. గాలి ద్వారా సోకుతుందని నిరూపించడానికి బలమైన ఆధారాలు లేవన్నారు. అమెరికా, యూకే, కెనడాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అంశంపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర అంశాలను వెల్లడించారు. గాలిద్వారా వ్యాపిస్తుంది అనడానికి కచ్చితమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
వాషింగ్టన్ స్కగిట్ కౌంటీ సభ్యుడు గతేడాది 122మంది బృందంతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వారిలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారు. కాగా ఈ విషయాన్ని పబ్లిక్ హెల్త్ కు స్కగిట్ కౌంటీ తెలియజేసింది. కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో చాలామంది కరోనా బారిన పడ్డారని తేలింది.
ఈ సమావేశంలో గానం చేస్తున్న సమయంలో ఏరోసోల్స్ ఉద్గారాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందిందని వైద్యారోగ్య శాఖ నిపుణులు అంచనా వేశారు. కరోనా సోకిన ఒక వ్యక్తి నుంచి 52 మందికి వైరస్ వ్యాపించింది. అయితే ప్రత్యక్ష తాకిడీ లేకుండానే మహమ్మారి సోకిందని తెలిపారు. ఈ సంఘటనతో గాలి ద్వారా వైరస్ సోకుతుందని నిర్ధారించవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అనంతరం నిర్వహంచిన పరిశోధనల్లో ఈ తరహా ఫలితాలు వెల్లడయ్యాయని తేల్చారు.
గాలి సోకే గదుల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంటుందని.. వెంటిలేషన్ ఉన్న దగ్గర వేగంగా విస్తరిస్తుందని తెలిపారు. ఇంట్లో ఉన్నా మాస్కులు ధరించడం ఉత్తమం అంటున్నారు. బాధితుల తుంపరల నుంచి కరోనా ఇతరులకు సోకుతుందని తెలిపారు. ఇక గాలి ద్వారా వ్యాపించదని ప్రజలు అలసత్వం ప్రదర్శిస్తున్నారని... అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకొని మహమ్మారి కట్టడిలో భాగంగా సహకరించాలని కోరుతున్నారు.