భారత్ లో కరోనా వైరస్ రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతోంది. గత వారం , పది రోజులుగా రోజుకి మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ... దేశంలోనే పుట్టిన డబుల్ మ్యూటెంటే ఈ కరోనా వేగవంత వ్యాప్తికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే, ప్రభుత్వం అధికారికంగా ఇంకా దీన్ని ధృవీకరించలేదు. ఈ పరిస్థితుల్లో మరో కొత్త సవాల్ వచ్చి పడింది. రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ సవాలు విసురుతున్న కరోనా తాజాగా మరో అవతారం ఎత్తింది. ఇప్పటికే దడపుట్టిస్తున్న డబుల్ మ్యూటెంట్ కు తోడుగా..ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఉనికిలో ఉన్న మూడు వేరియంట్లలోని కొన్ని లక్షణాలు ఈ ట్రిపుల్ మ్యూటెంట్ కు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ట్రిపుల్ మ్యూటెంట్ అంటే, మూడు జన్యుమార్పులు ఉన్న వైరస్ అని అర్థం.
దేశంలోని మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులకు ఈ ట్రిపుల్ మ్యూటెంట్ కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా తరచూ ఇలా కల్లోలం రేపడానికి ఈ కొత్త వేరియంట్లే కారణమని నిపుణులు చెప్తున్నారు. కరోనా కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. అనేక మందికి కరోనా వేగంగా సోకుతోంది అని మెక్‌గిల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ముధుకర్ పాయ్ వ్యాఖ్యానించారు. టీకాకు తరచూ మార్పులు చేస్తుండాలి. ఇందుకు కోసం ఈ మహమ్మారిపై లోతైన అవగాహన ఉండాలి అని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయ్ వ్యాఖ్యానించారు.
అయితే , భారత్ వంటి దేశాలకు ఇది పెను సవాలని నిపుణులు భావిస్తున్నారు. భారత్ లో కరోనా జన్యుమార్పులను పసిగట్టే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు కేవలం ఒక శాతం కేసుల్లో మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టే.. కరోనా డబుల్ మ్యూటెంట్ గుర్తించడంలో ఆలస్యం జరిగి కేసులు విపరీతంగా పెరిగి ఉండొచ్చని డా. పాయ్ అభిప్రాయపడ్డారు. కాగా వైరస్ వేగంగా వ్యాపించే కొద్దీ అనేక కొత్త తరాలు పుట్టుకొస్తాయని, ఈ క్రమంలో కొన్ని జన్యుమార్పులు సంతరించుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ట్రిపుల్ మ్యుటేషన్ ఎంత ప్రమాదకరమైనది అనేది అధ్యయనాల నుండి మాత్రమే తెలుస్తుంది. ప్రస్తుతానికి, భారతదేశం అంతటా 10 ల్యాబ్‌లు మాత్రమే వైరస్ జన్యు అధ్యయనాలలో పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. డబుల్ మ్యూటాంట్ పెరిగిన ప్రసార రేటును చూపిస్తుంది మరియు పిల్లలను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది మరింత తీవ్రమైన వ్యాధికారకతను కలిగి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు