కరోనా వేళ.. మాయదారి వైరస్ ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చి శరీరంలోకి చేరుతుందో అర్థం కాని పరిస్థితి. ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని భావించిన కరోనా.. తాజాగా వీవీఐపీలు ఉండే ప్రాంతాల్లోకి చొచ్చుకు రావటం ఆందోళనను రేకెత్తిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కీలకమైన చోట్ల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడటం కలకలాన్ని రేపుతోంది. ఆసుపత్రులకు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందన్న వాదనకు తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
దీనికి తగ్గట్లే దేశ రాజధాని లో తాజాగా చోటు చేసుకున్న పరిణామం షాకింగ్ గా మారింది. బాబూ జగ్జీవన్ రామ్ మెమోరియల్ ఆసుపత్రిలో పని చేస్తున్న 77 మందికి కరోనా పాజిటివ్ రావటం షాకింగ్ గా మారింది. వైద్యులకు.. వైద్య సిబ్బందికి.. ఆసుపత్రి స్టాప్ కు కరోనా ముప్పు ఎక్కువగా ఉంటుందన్న మాటను నిజం చేస్తూ.. సదరు ఆసుపత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్ రావటంతో అక్కడి వారు ఉలిక్కిపడే దుస్థితి.
తాజాగా కరోనా సోకిన 77 మందిలో 75 మంది వైద్య సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో విదులు నిర్వర్తించే పోలీసులు కావటం గమనార్హం. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆసుపత్రిలో 30 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వారితో కలిసి పని చేసే 39 మందిని క్వారంటైన్ కు పంపారు. ఇది సరిపోనట్లు మహారాష్ట్ర సచివాలయ సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. సచివాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మరో వైపు ఢిల్లీలోని నీతి ఆయోగ్ లోనూ కరోనా కలకలం రేగింది. డైరెక్టర్ స్థాయి అధికారికి కరోనా సోకటంతో ఆ భవనాన్ని నలభై ఎనిమిది గంటల పాటు మూసివేయాలని నిర్ణయించారు. కేంద్ర మార్గదర్శకాల్లో భాగంగా నీతి ఆయోగ్ భవనాన్ని శానిటైజ్ చేస్తున్నారు. ఏపీలోనూ సచివాలయంలో పని చేసే అటెండర్ కూ కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పటికే ఏపీ రాజభవన్ సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ రావటం తెలిసిందే.