మ‌రో కేంద్ర మంత్రికి క‌రోనా పాజిటివ్‌ !

Update: 2020-08-20 10:50 GMT
క‌రోనా వైరస్ బారిన మ‌రో కేంద్ర మంత్రి ప‌డ్డారు. తాజాగా కేంద్ర జ‌ల శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ కు క‌రోనా వైరస్ పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. దీనితో మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ వైద్యుల సూచ‌న మేర‌కు ఆసుపత్రి లో చేరారు. ఈ సంద‌ర్భంగా గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ ట్వీట్ చేస్తూ.. త‌న‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింద‌ని తెలిపారు. ముందస్తు జాగ్ర‌త్త‌గా డాక్ట‌ర్ల స‌ల‌హా మేర‌కు ఆస్ప‌త్రిలో చేరానని తెలిపారు. అలాగే ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాల‌ని, ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కేంద్ర మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  

ఈ విషయం ఇలా ఉంటే .. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నెలకొనే జల వివాదాలను చర్చించి, పరిష్కరించడానికి వీలుగా అపెక్స్‌  కౌన్సిల్ ‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి చైర్మన్‌ హోదాలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ అధ్యక్షత వహించాలి. ఈ నెల 25న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. దీనికి తగ్గట్టు ఇరు రాష్ట్రాలు కూడా సిద్ధం అవుతున్నాయి.  అయితే , ఈ మధ్యలోనే ఆయనకి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఈ నెల 25 న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.
Tags:    

Similar News