దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. దక్షిణాదికి సమీపాన ఉన్న మహారాష్ట్రతో పాటు తెలంగాణ, కేరళ, కర్ణాటకలను కరోనా వణికిస్తోంది. కేరళ, కర్ణాటకలో ఇప్పటికే కరోనా మృతులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా కర్నాటక లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ రాష్ట్రంలో మొత్తం 41 పాజిటివ్ కేసులు నమోదు కాగా తాజాగా ఆ రాష్ట్రం లాక్ డౌన్ పడింది. అయితే ఆ రాష్ట్రంలో ఏకంగా ఓ ఎంపీ కూతురికే కరోనా పాజిటివ్ సోకడం తో సర్వత్రా చర్చనీయాంశమైంది.
కర్ణాటకకు చెందిన ఓ ఎంపీ కూతురుకు కరోనా పాజిటివ్ తేలడంతో ప్రజలతో పాటు అధికారులు ఉలిక్కిపడ్డారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమతం కాగా ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారంట. ఇటీవల ఆ ఎంపీ కూతురు గయానా నుంచి భారతదేశానికి వచ్చింది. ఆ వచ్చినప్పటి నుంచి ఆమె ఇంటికే పరిమితమైంది. అయితే విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేస్తుండడం తో ఆమెకు చేశారు. కొన్ని రోజులకు ఆమె కరోనా లక్షణాలు కనిపించాయి. హోమ్ క్వారెంటైన్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. ఆమెకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆమెకు కరోనా సోకడంతో ఆ ఎంపీ కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.