అత్యవసర వైద్యం అన్నంతనే.. తక్షణం ఆ సేవలు లభించాలి. అంతేకానీ.. ఎవరో రికమండేషన్ చేస్తే కానీ వైద్యం దొరకదంటే ఎలాంటి సంకేతాన్ని ఇస్తున్నట్లు? కరోనా సెకండ్ వేవ్ పుణ్యమా అని ఇవాల్టి రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యం చేయించుకోవాలంటే ఆసుపత్రుల్లో బెడ్లు లభించటం లేదు. రెమిడెసివర్.. ఆక్సిజన్ సిలిండర్లు లాంటి సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా.. మొదటి వేవ్ తో పోలిస్తే దారుణమైన పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం ఏపీతో పోలిస్తే తెలంగాణలో కేసులు తక్కువన్నట్లు కనిపిస్తున్నా.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. సరైన వైద్యం అందక చాలామంది మరణిస్తున్నారు. రెమిడెసివర్ లాంటివి లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారెందరో. ఆసుపత్రి బెడ్ల కోసం భారీ ఎత్తున పైరవీలు చేసుకోవాల్సి వస్తోంది. ఇలాంటి వేళ.. కొందరు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విటర్ ఖాతాకు వినతులు చేస్తున్నారు.
ఆసుపత్రిలో బెడ్ కావాలి... ఆక్సిజన్ సిలిండర్ కావాలి.. ప్లాస్మా అవసరం.. చివరకు కోవిడ్ నిర్దారణ పరీక్షలకు తమకు సాయం చేయాలని అడుగుతున్న వారెందరో. అలాంటి వారి వినతుల్ని పరిష్కరించేందుకు కేటీఆర్ టీం ప్రయత్నిస్తోంది. తన ట్విటర్ ఖాతాకు వస్తున్న వినతుల్ని పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు హామీ ఇస్తున్నారు. మంత్రి సోషల్ మీడియా ఖాతాకు వచ్చే అభ్యర్థుల్ని నోట్ చేసుకొని.. వారి వ్యక్తిగత వివరాల్ని సేకరించి.. అవసరమైన సాయాన్ని అందిస్తున్నట్లుగా కేటీఆర్ కార్యాలయం చెబుతోంది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి సాయం చేస్తున్నందుకు తప్పనిసరిగా అభినందించాల్సిందే. అయితే.. విడిగా లభించని సేవలు.. కేటీఆర్ ట్విటర్ ఖాతాకు విన్నవించుకుంటే..ఆ రికమండేషన్ కు మాత్రమే అధికారులు.. ఆసుపత్రులు స్పందించటం దేనికి నిదర్శనం? అన్నది ప్రశ్న. ఇంతటి దయనీయ పరిస్థితుల వేళ రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగంగా చర్యలు చేపట్టాలి. సోనూసూద్ లాంటి సెలబ్రిటీ సాయం చేయటం.. అది తన వ్యక్తిగత పరపతితో.. డబ్బులతో చేసేది. కానీ.. మంత్రి కేటీఆర్ అన్న వారు ప్రజలందరికి మంత్రి. తన వరకు వచ్చే అభ్యర్థుల్ని ప్రయారిటీ బేస్ లో పూర్తి చేయటం.. అలా అడగలేని వారికి సేవలు లభించకపోవటం సమంజమే అంటారా కేటీఆర్?