ముంచుకొస్తున్న మూడో ముప్పు .. పిల్లలకు హెచ్చరిక, తస్మాత్ జాగ్రత్త!

Update: 2021-09-04 13:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి గత ఏడాదిన్నరకి పైగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా జీవితంలో ఎన్నడూ చూడని , చూస్తాం అని ఊహించని ఎన్నో సంఘటనలని చూశాం. ఇక విద్యార్థులు ఆన్‌ లైన్ తరగతులకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో, పిల్లలను తరగతి గదికి పంపుతున్నారు. పిల్లలు తిరిగి పాఠశాలకు వెళ్లడానికి చాలా ఉత్సాహం చూపుతుండగా డెల్టా వేరియంట్, సాధారణ జలుబు, శ్వాసకోస ఇన్‌ ఫెక్షన్లు వ్యాపించడం తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన కలిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తమ పిల్లలను స్కూళ్లకు పంపించే తల్లిదండ్రులు మూడు విషయాలను తప్పక గుర్తించుకోవాలని చెబుతున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుతం అత్యంత గందరగోళంగా ఉన్న ప్రశ్న ఏంటంటే ఇది జలుబా, లేక కరోనా. ఈ ప్రశ్న అందరినీ వేధిస్తోంది. తక్కువ మోతాదులో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు, జీర్ణాశయాంతర సమస్యలతో సహా సాధారణ జలుబు వంటి లక్షణాలను కలిగి ఉన్న పిల్లలలో కరోనా వైరస్ ఉండవచ్చు. వ్యాధి సోకిన పిల్లల్లో లక్షణాలు కనిపించొచ్చు. ఒక్కోసారి కనిపించకపోవచ్చు. అందుకే కరోనా నిర్దారణ పరీక్ష చేయించాలి.

కరోనా వైరస్ ఇన్‌ ఫెక్షన్ ఉన్న కొందరు పిల్లలు, టీనేజ్‌ లో కనిపించే ఏకైక లక్షణం కాలికి గీతలు లాంటి చర్మ గాయాలు. ముఖ్యంగా కాలి వేళ్ళ మీద ఉంటాయి. ఇది చాలా అరుదు. కోవిడ్ లక్షణాలు లేకపోవడం వల్ల పాజిటివ్ అని తేలే అవకాశాన్ని తోసిపుచ్చలేము. పిల్లలకు స్వల్ప లక్షణాలు కనిపించినా టెస్ట్ చేయించడం ఉత్తమం. ఇమ్యునో కాంప్రమైజ్డ్, కరోనా సోకిన వృద్ధుడు ఉంటే.. ఆ ఇంటికి చెందిన పిల్లవాడు పాఠశాలకు వెళ్తున్నా, బయటకు ఆడుకున్నా, స్నేహితులతో కలిసినా వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. సరైన సమయంలో టెస్ట్ చేయడం ద్వారా సరైన సమయానికి చికిత్స అందించడం జరుగుతుంది. దీనిద్వారా ప్రాణాపాయం తగ్గుతుంది.

ఇక చిన్నారులకు కరోనా పాజిటివ్ అని తేలినట్లయితే.. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీరు ఏమాత్రం భయపడాల్సిన పనిలేదు. ఇంట్లోని మిగతా వారికి కూడా టెస్ట్ చేయించుకోవాలి. పిల్లల్లో కరోనా నివారణకు మందులు ఇంకా లేనందున. వారికి సరైన విశ్రాంతి ఇవ్వడం, హైడ్రేటెడ్‌ గా ఉండటానికి జ్యూస్‌ లు ఇస్తుండాలి. కరోనా సోకిన చిన్నారులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ఒకవేళ చిన్నారులు తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్నట్లయితే. వెంటనే వైద్య నిపుణులను ఆశ్రయించాలి. ఆకస్మిక శ్వాసలోపం, తీవ్రమైన ఛాతి నొప్పి, అధిక జ్వరం, తీవ్రమైన కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించండి. అలాగే కరోనా నియమం అయిన పేస్ మాస్క్ ధరించండి. టీకాలు వేయించుకోండి


Tags:    

Similar News