కరోనా వేళ.. కండోమ్ ​ల అమ్మకాలు పెరిగాయి.. అసలు విషయం ఏమిటంటే..!

Update: 2020-12-28 15:10 GMT
కరోనా లాక్​డౌన్​ అనేక మంది జీవితాలను తలకిందులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక లక్షలమంది ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయారు. హోటల్​ రంగం, ఆతిథ్యరంగం కుదేలయ్యింది. అయితే ఒక్క వ్యవసాయరంగం, సాఫ్ట్ వేర్​ రంగంమీద కరోనా ప్రభావం అంతగా లేదనే చెప్పాలి. మిగతా రంగాలతో పోల్చుకుంటే సాఫ్ట్​వేర్​కు పెద్దగా నష్టం వాటిళ్లలేదు. సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు వర్క్​ఫ్రం హోం చేశారు. అయితే ఈ కరోనా టైంలో ఓ ఆసక్తికర విషయం చోటుచేసుకుంది. అదేమింటే.. కండోమ్​లు, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ల అమ్మకాలు పెరిగాయట. కరోనా టైంలో వచ్చిన వర్క్​ఫ్రంహోం కల్చర్​ ప్రజల జీవనవిధానంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చింది.

సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు, ఇతర రంగాలకు చెందిన కొందరు ఉద్యోగులు ఇంటి పట్టునే ఉండటం వల్ల సెక్స్​లైఫ్​ను బాగా ఎంజాయ్​ చేశారట. గతంలో కంటే భిన్నంగా భాగస్వామితో గడిపారట. ఇప్పటికే పలు పరిశోధనలు ఈ విషయాన్ని తేల్చిచెప్పాయి. అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా కండోమ్​ల వాడకం పెరగడం కూడా ఇదే విషయాన్ని సూచిస్తోంది.

లాక్ డౌన్ లో టైమ్​లో ముఖ్యంగా సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు సెక్సు లైఫ్ ని విపరీతంగా ఎంజాయ్ చేశారని ఇప్పటికే పలు సర్వేలు తేల్చాయి కూడా. అయితే కండోమ్ అమ్మకాలు రాత్రి పూట కంటే కూడా పగటి పూటే ఎక్కువగా పెరిగాయట. ఆన్​లైన్​లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కండోమ్​లకు ఆర్డర్లు ఇచ్చారట.

హైదరాబాద్​లో కూడా గతంలోకంటే ఆరురెట్లు కండోమ్​ అమ్మకాలు పెరిగాయట. చెన్నైలో ఐదు రెట్లు, జైపూర్ లో నాలుగు రెట్లు, బెంగళూరు, ముంబయిలలో మూడు రెట్లు ఎక్కువగా కండోమ్ వినియోగం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కండోమ్​తోపాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఉత్పత్తులైన ఐపిల్.. పెగ్రెన్సీ టెస్టింగ్ కిట్లు కొనుగోళ్లు కూడా ఆయా నగరాల్లో గతంలో కంటే ఎన్నో రెట్లు పెరిగాయట.




Tags:    

Similar News